గోపీచంద్ విందులో ప్రభాస్, అల్లు అర్జున్ సందడి.. వైరల్ అవుతున్న పిక్స్
టాలీవుడ్ యంగ్ హీరోలు ఒకరికి ఒకరు అండగా ఉంటూ, స్నేహభావం పెంపొందించుకోవడం ప్రేక్షకులలో జోష్ నింపుతోంది. ఒకరి ఇంట జరిగిన వేడుకకు మరో హీరో హాజరు కావడం వారి మధ్య ఉన్న స్నేహానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ కోవలోనే తాజాగా గోపీచంద్ ఇంట్లో జరిగిన ఓ వేడుకకు ప్రభాస్, అల్లు అర్జున్ హాజరై తెగ సందడి చేశారు.
శుక్రవారం (సెప్టెంబర్ 13) గోపీచంద్ కొడుకు మొదటి పుట్టినరోజు. ఈ సందర్భంగా తన నివాసంలో అంగరంగ వైభవంగా బర్త్ డే వేడుక ఏర్పాటు చేశాడు గోపీచంద్. ఈ వేడుకకు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా హాజరు కావడం విశేషం. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరోలను ఇలా చూసి మురిసిపోతున్నారు ఆడియన్స్. ఈ ఫొటోల్లో ప్రభాస్, గోపీచంద్, అల్లు అర్జున్ ముగ్గురు కూడా స్టైలిష్ లుక్‌లో ఎంతో చూడముచ్చటగా కనిపించారు.

ఇక వీరి సినిమాల విషయానికొస్తే.. 'సాహో' రూపంలో భారీ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చాడు ప్రభాస్. 'అల.. వైకుంఠపురములో' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. ఇక తన కొత్త సినిమా 'చాణక్య' షూటింగ్ లో చురుకుగా పాల్గొంటున్నాడు గోపీచంద్. ఈ సినిమాతో పాటు బిను సుబ్రహ్మణ్యం అనే కొత్త దర్శకుడితో కలిసి మరో సినిమా చేయబోతున్నాడు గోపీచంద్. గురువారం రోజే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.


Click it and Unblock the Notifications











