సూపర్ హ్యాపీ!: 'మిర్చి'తో ఫ్యాన్స్ మధ్య ప్రభాస్ హల్‌చల్
హైదరాబాద్: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బుధవారం హైదరాబాదులోని ఆర్టీసీ క్రాసు రోడ్డులో గల సంధ్య థియేటర్‌లో అభిమానుల సమక్షంలో మిర్చి చిత్రాన్ని వీక్షించారు. ప్రభాస్ కథానాయకుడిగా, అనుష్క నాయికగా మిర్చి సినిమా వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో అభిమానుల మధ్య సినిమాను చూసేందుకు ప్రభాస్ సంధ్య థియేటర్‌కు వచ్చారు. సినిమాను చూసిన అనంతరం ఆయన కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు.
ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడారు. సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటం ఆనందంగా ఉందన్నారు. తన సినిమా హిట్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సినిమా అంతటా విజయవంతంగా ప్రదర్శింపబడుతుందని అన్నారు. ప్రభాస్ మిర్చి చిత్రం అద్భుతంగా ఉందని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అభిమాన హీరోతో చేతులు కలిపేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం కనబర్చారు.
కాగా ప్రభాస్ నటించిన 'మిర్చి' చిత్రం ఓవర్సీస్‌లో కలెక్షన్స్ విషయంలో అదరగొడుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈచిత్రం గడిచిన వీకెండ్ యుఎస్ బాక్సాఫీసు చార్టులో టాప్ పొజిషన్ దక్కించుకోవడంతో పాటు హిందీ సినిమాలు 'స్సెషల్ 26', 'ABCD-ఎనీ బడీ కెన్ డాన్స్' చిత్రాలను 2, 3 స్థానాలకు నెట్టేసింది. అమెరికాలో ఫిబ్రవరి 7న విడుదలైన 'మిర్చి' చిత్రం 82 స్క్రీన్లలో ప్రదర్శితం అవుతూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
అమెరికాలో తొలి వీకెండ్ గడిచే నాటికే ఈ చిత్రం రూ. 2.54 కోట్లు($4,71,941) వసూలు చేసింది. మిర్చి విడుదల కారణంగా అప్పటికే విడుదలైన పలు తెలుగు సినిమాల బిజినెస్ బాగా డౌన్ అయింది. 'మిర్చి' యూకె కలెక్షన్స్ విషయానికొస్తే.. యుకెలోనూ మిర్చి చిత్రం బిజినెస్ డీసెంట్ గా సాగుతోంది. ఈ వీకెండ్ ఈచిత్రం రూ.3.03 లక్షలు(£3,591) వసూలు చేసింది. వీటితో కలుపుకుని మిర్చి టోటల్ ఓవర్సీస్ కలెక్షన్స్ తొలి వారాంతం ముగిసే నాటికి రూ. 2.57 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications











