»   »  డార్లింగ్స్ అందరికి ధ్యాంక్స్, లవ్ : ప్రభాస్

డార్లింగ్స్ అందరికి ధ్యాంక్స్, లవ్ : ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాహుబలి హీరో అయిన ప్రభాస్ తన ఫేస్ బుక్ ఖాత ద్వారా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. 2015 ని గుర్తుంచుకునేలా చేసిన డార్లింగ్స్ అందరికి ధ్యాంక్స్, లవ్ యు ఆల్ అండ్ హ్యాపి హ్యాపి 2016 అంటు పెట్టిన పోస్ట్ ఇక్కడ చూడండి.

Thank you darlings for making 2015 a very memorable year for me... Love you all and a very Happy Happy 2016..

Posted by Prabhas on Thursday, December 31, 2015

మరో ప్రక్క బాహుబలి టీమ్ న్యూ ఇయిర్ ని పురస్కరించుకుని విషెష్ చెప్తూ ... ఓ వీడియోని విడుదల చేసారు. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. సుమారు రూ.500 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాల సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రం ప్రభాస్‌కు అంతర్జాతీయంగా స్టార్‌ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక 'బాహుబలి' రెండో భాగం రీసెంట్ గా మొదలైంది. ఈ సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Prabhas wishes to New Year

'బాహుబలి 2' గురించి రానా మాట్లాడుతూ... ''బాహుబలి - ది కంక్లూజన్‌' వచ్చాక 'బాహుబలి - ది బిగినింగ్‌' చాలా చిన్నదిగా కనిపిస్తుంది. రెండో భాగంలో పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలు, సెట్లు... ఇలా అన్నీ ఇంకా భారీగా ఉంటాయి''అన్నాడు రానా. టైటిల్ తో పాటు అన్ని విషయాల్లోనూ అత్యంత భారీతనం కనిపించిన బాహుబలి చిత్రం కలెక్షన్లను కూడా భారీగానే కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.

English summary
Thank you darlings for making 2015 a very memorable year for me... Love you all and a very Happy Happy 2016..
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu