For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘బాహుబలి' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలైన వెంటనే ప్రభాస్ మరో సినిమా షూటింగుకు రెడీ అవుతున్నాడు. ఆ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘రన్ రాజా రన్' సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుజిత్ ఈ సారి ప్రభాస్ కోసం అదిరిపోయే కథను సిధ్దం చేసుకున్నాడు

  ఈ సినిమాలో ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఎవరిని ఎంపిక చేస్తారనేది త్వరలో తేలనుంది. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ పూర్తి డిఫరెంటుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్‌లు ‘యువి క్రియేషన్స్' బేనర్లో నిర్మించనున్నారు. గతంలో వీరు ప్రభాస్ హీరోగా ‘మిర్చి' చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  బాహుబలి సినిమా విషయానికొస్తే...

  ‘బాహుబలి'....తెలుగు సినిమా చరిత్రలో మునుపెన్నడూ రాని ఒక అద్భుతమైన ప్రాజెక్టు. దాదాపు 100 కోట్లకుపైగా బడ్జెట్‌తో అపజయం అంటూ ఎరుగటని దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమేకాదు యావత్ భారత దేశ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  Prabhas with a new heroine

  దాదాపు రెండేళ్ల నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్స్ జరుపుకుంటోంది. బాహుబలి పార్ట్-1 ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాను దక్కించుకోవడానికి పలు ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారు.

  విడుదలకు ముందే ఈ చిత్రం దాదాపు 100 కోట్ల బిజినెస్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళంలో విడుదల కాబోతోంది. తమిళ రైట్స్ ఇప్పటికే రూ. 27 కోట్లు వెచ్చించి యూవి ప్రొడక్షన్స్ కొనుగోలు చేసింది. స్టూడియోగ్రీన్ సహకారంతో ఈ చిత్రాన్ని అక్కడ భారీగా విడుదల చేయనున్నారు. తమిళ రైట్స్ అమ్మడం ద్వారా వచ్చి రూ. 27 కోట్ల మొత్తాన్ని ప్రభాస్ రెమ్యూనరేషన్ గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఎందుకంటే గత రెండేళ్లుగా ప్రభాస్ ఇతర సినిమాలేవీ చేయకుండా కేవలం ఈ సినిమా కోసమే పని చేస్తున్నారు. ఈ మాత్రం ఇవ్వడం సబబే అంటున్నారు.

  మరో వైపు ఈ చిత్రం ఏపీ, తెలంగాణ, కర్నాటక ప్రాంతాల బిజినెస్ కూడా జరిగి పోయిందని తెలుస్తోంది. నైజా రైట్స్ రూ. 25 కోట్లు, సీడెట్ 13 కోట్లు, ఈస్ట్ గోదావరి 5 కోట్లు, వెస్ట్ గోదావరి 4.5 కోట్లు, వైజాగ్ : రూ. 7.5 కోట్లు, నెల్లూరు రూ. 3.5 కోట్లు, కృష్ణా రూ. 5 కోట్లు, గుంటూరు రూ. 6.5 కోట్లు, కర్నాటక రూ. 9 కోట్లకు అమ్ముడయినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం+తమిళ రైట్స్ కలిపితే 100 కోట్ల బిజినెస్ దాటింది. ఇక సినిమా హిట్ టాక్ వస్తే లాభాలు భారీగా ఉంటాయిని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో అత్తారింటికి దారేది చిత్రం మాత్రమే రూ. 85 కోట్ల వసూళ్లతో అగ్ర స్థానంలో ఉంది. బాహుబలి చిత్రం ఆ రికార్డును బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.

  English summary
  After a successful debut with 'Run Raja Run', director Sujeeth is getting ready to direct his next, which stars Prabhas in the lead role. This movie will be produced by Vamsi and Pramod, who earlier produced Prabhas' 'Mirchi' and Sujeeth's 'Run Raja Run', on UV Creations banner. According to reports a new heroine will pair up with Prabhas in this movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X