పోటీ పడను,వివాదాలకు పోను: ప్రభాస్ ఇంటర్వూ
హోంపేజి సినిమా ఇంటర్వ్యూ
Monday, October 25 2004
నాలుగేనాలుగు సినిమాలతో వెండి తెరపై కనకవర్షం కురిపించిన ప్రభాస్‌దిఆకర్షణీయమైన బాడీ లాంగ్వేజి.రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ్ముడికుమారుడైన ప్రభాస్ నేటియువతరం హీరోల్లో అగ్రస్ధానానికిచేరుకున్నాడు. ఇటీవల పుట్టిన రోజుజరుపుకున్న సందర్భంగా ఆరుఅడుగుల హీరో ప్రభాస్ ఇంటర్వ్యూ
మీసినిమాల్లో మీఇన్వాల్వ్‌మెంట్ ఎంతవరకు ఉంటుంది?
నా క్యారెక్టర్ వరకు మాత్రమే. ఇతరవిషయాల్లోజోక్యం చేసుకోను.
హీరోయిన్స్‌విషయంలో మీ భేవియర్ ఎలా ఉంటుంది?
మొదటి సినిమాలో బాగా ఇబ్బంది పడ్డాను. రెండో,మూడో సినిమాల నుంచి సిగ్గు పోయింది. అలవాటైపోయింది.
మీ ఎత్తువిషయంలోమీరెలా ఫీలవుతుంటారు?
హైట్ అనేది నాకు దేవుడిచ్చిన వరంగాపరిగణిస్తాను.హైట్ వల్లనే నాకు ప్రత్యేకమైనగుర్తింపు వచ్చిందని భావిస్తాను.
కృష్ణంరాజు గారుమీరు కలిసి నటిస్తారని వార్తలు వస్తున్నాయి,నిజమేనా?
పెద నాన్నగారితో నటించాలని నాకూ ఆశగా ఉంది.వచ్చేసంవత్సరం ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాము.కథా చర్చలు జరుగుతున్నాయి.
వర్షంసినిమా ద్వారా మీలో మంచి డ్యాన్సర్ ఉన్నాడనినిరూపించుకున్నారు. ఆ ఇమేజినికాపాడుకోడానికి ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు?
నేను పెద్దడ్యాన్సర్‌ని కాను. వర్షం సమయంలోఒక నెల డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాను.
మీరు ఇష్టపడేడైరెక్టర్లు?
రాంగోపాల్ వర్మ,మణి రత్నం. వీరికి తోడు నాతో పనిచేసిన డైరెక్టర్లందరూఇష్టమైన వారే.
మీరు ఏ రకమైనడెస్‌లు ఇష్టపడతారు?
క్యాజువల్స్ ఏవైనా ఇష్టమే. ఎదుటి వారిని ఇంప్రెస్‌చేసేవిధంగా డ్రెస్‌లు ఉండేలా జాగ్రత్తపడతాను.
ఇప్పుడు కృష్ణ వంశీదర్శకత్వంలో చక్రంలో నటిస్తున్నారుకదా? ఆయనతో కోఆర్డినేషన్ ఎలా ఉంది?
కృష్ణవంశి వర్క్ విషయంలో చాలా సిన్సియర్. తాను ఆశించినఅవుట్ పుట్ వచ్చే వరకు రాజీపడరు. చక్రంలో నాది విభిన్నమైనపాత్ర. దీనిని వివరించే కంటే తెర మీద చూస్తేనే మజా ఉంటుంది.
Archives


Click it and Unblock the Notifications











