Salaar ఆంధ్రాలో సలార్ టికెట్ రేట్ల వివాదం.. ప్రభాస్ మూవీకి ఆ రేంజ్‌లో ఏపీ సర్కార్ పెంచుతుందా?
సలార్ చిత్రం రిలీజ్ పలుమార్లు వాయిదా పడిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎట్టకేలకు గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. అయితే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కోసం ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆంధ్రాలో ఈ చిత్రం టికెట్ రేట్ల పెంపుపై వ్యవహారంపై రకరకాల ఊహాగానాలు, విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
గతంలో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, బాలకృష్ణ, నాని సినిమాలు రిలీజ్ సమయంలో టికెట్ రేట్ పెంచాలని చేసిన రిక్వెస్ట్‌ను ఆంధ్రా ప్రభుత్వం నిరాకరించింది. అయితే ప్రత్యేక షోలకు కూడా అనుమతి ఇవ్వకుండా అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. ఈ వ్యవహారాలు అప్పట్లో మీడియాలో సంచలనం రేపాయి.

అయితే టికెట్ రేట్లు పెంచకపోవడంపై పవన్ కల్యాణ్, బాలకృష్ణ, నాని లాంటి వాళ్లు ఘాటుగా స్పందించారు. శామ్ సింగరాయ్ సినిమా రిలీజ్ సమయంలో ఏపీ సర్కారుపై నాని ఫైర్ అయ్యారు. ఏపీలో సినిమా టికెట్ కౌంటర్ల కంటే.. దాని ముందు ఉన్న కిల్లీ కొట్టులో కలెక్షన్లు ఎక్కువగా ఉంటాయనే వరకు నాని స్వరం పెంచారు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సలార్ మూవీ రిలీజ్‌కు ముందు ఆంధ్రాలో ముఖ్యమంత్రి, ప్రభుత్వ వర్గాలను సినిమా యూనిట్ టికెట్ రేట్లు పెంచాలని విన్నవించుకొన్నట్టు తెలిసింది. ఏపీలోని మల్టీప్లెక్స్‌లో 400 రూపాయలకుపైగా టికెట్ ఉండేలా.. సింగిల్ థియేటర్‌లో 250 టికెట్ రేట్ ఉండేలా అనుమతి ఇవ్వాలని తమ విన్నపంలో పేర్కొన్నట్టు తెలుస్తున్నది.

అయితే సలార్ చిత్ర యూనిట్ తరపున కొందరు సినీ పెద్దలు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు అనే వార్తపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచకూడదు. సలార్ సినిమా మల్టీప్లెక్స్ టికెట్ రేట్ 200, సింగిల్ స్క్రీన్ రేట్ 150 మించకుండా పెట్టాలి అని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఒకవేళ సలార్ టికెట్ రేట్లు భారీగా పెంచితే.. ప్రభుత్వంలోని పెద్దలు సలార్ యూనిట్‌తో కుమ్మక్కై పోయారని భావించాల్సి వస్తుంది. సినిమా టికెట్ రేట్లు పెంచితే ప్రేక్షకులపై భారం పడుతుందని గతంలో చెప్పిన మాటలకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. లేకపోతే ఏదో గందరగోళం జరిగిందని భావిస్తా అని సినీ ప్రముఖులు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ టికెట్లు రేట్లు పెంచుతుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉండగా, కేజీఎఫ్ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ చిత్రం డిసెంబర్ 22వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











