ప్రభుదేవా....'ABCD ఎనీబడీ కెన్ డాన్స్'
కొరియోగ్రాఫర్‌గా తెరంగ్రేటం చేసి సత్తా చాటిన ప్రభుదేవా...ఆపై నటుడిగాను అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడిగా తానేంటో నిరూపించుకుంటున్నాడు. ఇలా అన్ని విభాగాల్లోనూ ఇట్టే ఇమిడి పోతున్న ప్రభుదేవా డాన్స్ ప్రధానంగా కొనసాగే ఓ సినిమాలో ఆయన నటిస్తున్నాడు. డాన్స్ మాస్టర్ రేమో డిసౌజా దర్శకత్వంలో 'ABCD (ఎనీబడీ కెన్ డాన్స్)' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రభుదేవా డాన్సర్ గా ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. లారెన్స్, గణేష్ ఆచార్య కూడా ఈ చిత్రంలో కనిపిస్తారని తెలుస్తోంది.
ఈ చిత్రం పూర్తిగా కొరియోగ్రఫీ నేపథ్యంలో సాగుతుందని, డాన్స్ ఇష్ట పడేవారికి ఈసినిమా పూర్తి సంతపృని ఇచ్చే విధంగా ఉంటుందని, ఇదివరకు ఎన్నడూ లేని విధంగా, ఏ సినిమాలోనూ చూడని విధంగా కళ్లు చెదిరే స్టెప్పులు ఈ చిత్రం కంపోజ్ చేస్తున్నారని అంటున్నారు. 3డి చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం మరో ప్రత్యేకత. మరి ఇంత మంది డాన్స్ మాస్టర్లు కలిసి చేస్తుండటం, 3డి సినిమా కావడంతో ఇటు సినీ ప్రేమికుల్లోనూ ఆసక్తి నెలకొంది.
ఇక పోతే ప్రభుదేవా ప్రస్తుతం బాలీవుడ్ లో 'రౌడీ రాథోర్' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న ఈ చిత్రం తెలుగులో రాజమౌళి-రవితేజ కాంబినేషన్లో వచ్చిన 'విక్రమార్కుడు' చిత్రానికి రీమేక్.


Click it and Unblock the Notifications











