ఐపీఎల్ ప్రారంభ వేడుకలో ప్రభుదేవా డాన్స్
ఈయేడు ప్రారంభం అయ్యే ఐపీఎల్ సీజన్ ప్రారంభ వేడుకలో ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా స్వయంగా డాన్స్ చేసి అభిమానులను అలరించనున్నాడు. ఏప్రిల్ 3వ తేదీన చెన్నయ్‌లోని వైఎంసీఎ గ్రౌండ్స్‌లో షూరూ కానున్న క్రికెట్ సంబరంలో బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రాలతో కలిసి ప్రభుదేవా స్టెప్పులు వేయనున్నాడు. మరో విశేషం ఏమిటంటే అదే రోజు ప్రభుదేవా పెట్టిన రోజు కావడం. గతంలో ఎన్నడూ ఇలాంటి పెద్ద కార్యక్రమాల్లో ప్రభుదేవా డాన్స్ చేయలేదు. తొలిసారిగా, అదీ తన పుట్టిన రోజున ఈ అవకాశం దక్కడంతో ప్రభుదేవా అద్భుతమైన స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తున్నాడట.
భార్యతో విడాకులు, నయనతారతో పెళ్లి వరకు వచ్చిన వ్యవహారం బెడిసి కొట్టడంతో చాలా అప్ సెట్ అయిన ప్రభుదేవా ప్రస్తుతం పూర్తిగా దర్శకత్వంపైనే తన దృష్టి సారించాడు. ప్రస్తుతం ప్రభుదేవా బాలీవుడ్ లో అక్షయ్ కుమర్ హీరోగా 'రౌడీ రాథోర్' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ-రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'విక్రమార్కుడు' చిత్రానికి ఇది రీమేక్.


Click it and Unblock the Notifications











