»   » నాన్నతో అద్భుతమైన క్షణాలు: తండ్రితో డాన్స్ చేసిన ప్రభుదేవా (వీడియో)

నాన్నతో అద్భుతమైన క్షణాలు: తండ్రితో డాన్స్ చేసిన ప్రభుదేవా (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: సౌతిండియాలో నిన్నటితరం డాన్స్ మాస్టర్లలో ప్రముఖుడిగా పేరు తెచ్చుకున్నారు ముగురు సుందర్... అలియాస్ సుందరం మాస్టార్. ఆయన వారసుడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టిన ప్రభుదేవా ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా కీర్తి పొందిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తూ కనిపించిన సందర్భాలు చాలా అరుదు. తాజాగా ఓ ప్రైవేటు ఛానెల్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రభుదేవా తన తండ్రితో కలిసి స్టెప్పులేశారు. 'నేను, నాన్న... అద్భుతమైన క్షణాలు, ఎన్నటికీ మర్చిపోలేను' అని ప్రభుదేవా ట్వీట్‌ చేశారు. ఇద్దరూ కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోను రీట్వీట్‌ చేశారు.

ప్రభుదేవా సినిమాల విషయానికొస్తే....
ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా అభినేత్రి. ఈ సినిమాకు తమిళ దర్శకుడు ఎఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మూడు భాషల్లో వేర్వేరు టైటిల్స్ తో రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి తెలుగులో 'అభినేత్రి' అనే టైటిల్ ఫిక్స్ చేయగా... తమిళంలో 'డెవిల్' పేరుతో, హిందీలో 'టూ ఇన్ వన్' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ 'అభినేత్రి'కి ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, తమిళ వర్షన్ ను ప్రభుదేవా, హిందీ వర్షన్ ను సోనూసూద్ లు నిర్మిస్తున్నారు.

English summary
Prabhu Deva’s dance-off with his father is all kinds of awesome. "My father n me , wonderful moment , unforgettable" Prabhu Deva tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu