ప్రభుదేవ స్పీడుకు బాలీవుడ్ షేక్!
ప్రభుదేవ స్పీడుకి బాలీవుడ్ షేక్ అయ్యే సందర్భం త్వరలోనే వస్తుందంటున్నారు దక్షిణాది జనాలు. కోరియో గ్రాఫర్ నుంచి యాక్టర్ గా ఆపై దర్శకుడిగా టర్న్ అయిన ప్రభు...ఇప్పుడు వరుస సినిమాలతో బాలీవుడ్‌లో దుమ్ము రేపేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన వాంటెడ్ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రభు...తాజాగా అక్షయ్ కుమార్‌తో రౌడీ రాథోడ్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్టు ఇంకా పూర్తి కానేలేదు మరో బాలీవుడ్ ప్రాజెక్టు ప్రభుదేవ చేతులోకి వచ్చింది. ఈ సినిమా తర్వాత ప్రభుదేవా అజయ్ దేవగన్ హీరో రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమా 2012 ద్వితీయార్థం వరకు సెట్స్ మీదకు వచ్చే అవకాశాలున్నాయి. యాక్షన్ నేపథ్యంలో సినిమా ఉంటుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
దక్షిణాది సినిమాల్లో కొరియో గ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రభుదేవ అనతి కాలంలోనే నటుడిగా తన సత్తా చాటుకున్నాడు. అంతటితో ఆగకుండా దర్శకుడిగా మారి తన క్రియేటివిటి ఏమిటో దక్షిణాది జనాలకు రుచి చూపించాడు. అతను దర్శకత్వం వహించిన పలు సినిమాలు ఇక్కడ మంచి విజయం సాధించడమే ఇందుకు నిదర్శనం. తాజాగా బాలీవుడ్ లో తనదైన స్టయిల్‌లో దూసుకెలుతున్నాడు ప్రభు. ప్రభుదేవ ఊపు ఇదే రేంజ్ లో సాగితే ప్రభు అక్కడ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా ప్రముఖుల సరసన చేరడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.


Click it and Unblock the Notifications











