ప్రభుదేవా డైరక్షన్ లో మరో స్టార్ హీరో ...
గతంలో సల్మాన్ ఖాన్ తో పోకిరి చిత్రాన్ని 'వాంటెడ్" గా హిందీలో రీమేక్ చేసిన చిత్రానికి యాక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహించి సల్మాన్ కి ఘన విజయాన్ని అందించారు. ఆ తరహా మాస్, యాక్షన్ ఇమేజ్ ని కోరుకొంటున్న వాళ్లు ప్రభుదేవాతో పనిచేయాలని కోరుకుంటున్నారు. వినోద ప్రధనమైన చిత్రాలకే పరిమితమైన అక్షయ్ కుమార్ తన శైలి మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. అక్షయ్ కుమార్ హీరోగా సంజయ్ లీలా భన్సాలీ నిర్మించే చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నట్టు ప్రభుదేవా చెప్పారు. వాంటెడ్ లా ఇది రీమేక్ చిత్రం కాదని, కొత్తదనం నిండిన కథతో రూపొందుతోన్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉంది. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
ప్రభుదేవా అక్షయ్ కుమార్ సంజయ్ లీలా భన్సాలీ వాంటెడ్ సల్మాన్ ఖాన్ పోకిరి మహేష్ బాబు prabhu deva akshay kumar sanjay leela bhansali salman khan pokiri mahesh babu


Click it and Unblock the Notifications