రజనీకాంత్ సినిమాపై కన్నేసిన ప్రభుదేవా?
కొరియో గ్రాఫర్ నుంచి నటుడిగా, ఆపై దర్శకుడిగా మారిన ప్రభుదేవా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు దర్శకత్వం చేసే స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో 'రౌడీ రాథోర్' చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రభుదేవా మరో ప్రాజెక్టుకు కూడా సిద్దం అయ్యాడు.
త్వరలో ఆయన అజయ్ దేవగన్‌తో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రభుదేవా ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు వెల్లడించారు. ఈ చిత్రం రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ 'బాషా' చిత్రం ఆధారంగా రూపొందుతోందని తెలుస్తోంది. ఈచిత్రంలో అజయ్ దేవగన్ బాషా సినిమాలో మాదిరి ఆటో వాలాగా, డాన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు సినిమా 'విక్రమార్కుడు'ను బాలీవుడ్‌లో 'రౌడీ రాథోడ్'గా రీమేక్ చేసిన ప్రభుదేవా అసలు మార్పు అనేదే లేకుండా మక్కికి మక్కికి, సీన్ టు సీన్..డైలాగ్ టు డైలాగ్ కాపీ కొట్టాడు. ఈ నేపథ్యంలో అజయ్ దేవగన్‌తో తీయబోయే బాషా చిత్రాన్ని కూడా మక్కికి మక్కి కాపీ కొడతాడా? అని చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రభుదేవా బాలీవుడ్ మూవీ 'ఎబిసిడి'(ఎనీ బడీ కెన్ డాన్స్) అనే చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. రెమో డిసౌజా ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పూర్తిగా కొరియోగ్రఫీ నేపథ్యంలో సాగుతోంది.


Click it and Unblock the Notifications











