ప్రభుదేవాకు ఇపుడు ఇల్లు లేదు...కారణం శ్రీదేవి ఫ్యామిలీ!

ముంబై: ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవాకు ప్రస్తుతం ముంబై నగరంలో ఉండటానికి ఇల్లు లేకుండా పోయింది. బాలీవుడ్‌కి షిప్ట్ అయిన తర్వాత ప్రభుదేవా ముంబైలో హీరోయిన్ శ్రీదేవికి చెందిన ఇంట్లో అద్దెకు ఉంటూ వస్తున్నాడు. అయితే శ్రీదేవి అండ్ ఫ్యామిలీ నివాసం ఉంటున్న బంగ్లా నెం.18 డిసెంబర్ 21న అగ్ని ప్రమాదానికి గురైంది.

దీంతో శ్రీదేవి ఫ్యామిలీ తిరిగి తమ పాత ఇంటికి వస్తోంది. ఈ కారణంగా ప్రభుదేవా ఆ అద్దె ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితే ప్రభుదేవా ఇప్పటి వరకు ముంబైలో తనకు అనుకూలంగా ఉండే మరొక అద్దె ఇల్లును వెతుక్కోలేక పోయాడట. తాను కోరుకున్న విధంగా ఇప్పటి వరకు ఇల్లు దొరకక పోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

 Prabhu Deva Homeless After Returning Apartment To Sridevi Kapoor, Family

శ్రీదేవి, బోణీ కపూర్ ఇల్లు అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిన వెంటనే.....తాను అద్దెకు ఉంటున్న వారి పాత ఇంటిని డీసెంటుగా ఖాళీ చేయాలని ప్రభుదేవా నిర్ణయించుకున్నాడు. శ్రీదేవి అడగక ముందే వారి ఇంటిని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. మరొక అద్దె ఇల్లు కోసం వెతుక్కుంటున్నాడు.

బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం...ఇటీవల మాల్దీవుల నుంచి తిరిగి వచ్చిన శ్రీదేవి, బోణీ కపూర్ మరియు వారి పిల్లలు ఇప్పటికే తమ పాత ఇంటికి షిప్ట్ అయ్యారని, క్రమక్రమంగా తమ వస్తువులను కూడా ఇక్కడికి తరలిస్తున్నారని తెలుస్తోంది. చెన్నైలో సొంత ఇల్లు ఉన్న ప్రభుదేవా తాజాగా తన వృత్తిలో భాగంగా చెన్నై, మైసూర్ చక్కర్లు కొడుతున్నారట. ఆయన జనవరి 4న ముంబై వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ముంబైలోని జుహు, అంధేరి ప్రాంతంలో ప్రభుదేవా మరొక ఇల్లు వెతుక్కునే పనిలో ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X