స్త్రీలంటే అంత విరక్తి ఎందుకు, కారణం నయనతారేనా?
హైదరాబాద్: దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, హీరోయిన్ నయనతార మధ్య కొంత కాలం పాటు ఘాటైన ప్రేమాయణం సాగిన సంగతి తెలిసిందే. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అప్పటికే ముగ్గురు పిల్లల తండ్రి అయిన ప్రభుదేవా నయనతార ప్రేమ కోసం తన భార్య రమాలతకు విడాకులు కూడా ఇచ్చాడు. అప్పట్లో నయనతార, ప్రభుదేవా ప్రేమ వ్యవహారం ఓ సంచలనం.
కొంతకాలం పాటు ఇద్దరూ పబ్లిక్‌గానే చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆ తర్వాత ఏమైదో తెలియదు కానీ ఇద్దరూ విడిపోయారు. అంత అన్యోన్యంగా ప్రేమించుకున్న వీరు విడిపోవడానికి దారితీసిన అంశాలు ఏమిటో ఇప్పటికీ బయటకు రాలేదు. ఇద్దరూ కూడా విడిపోయే ముందు ఒకరిపై ఒకరు నిందలు, విమర్శలు చేసుకోకుండా సైలెంటుగా ఎవరి దారి వారు చూసుకున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్లో దర్శకుడిగా బిజీ బిజీగా గడుపుతున్న ప్రభుదేవాకు పలువురు హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చారు. ఈ క్రమంలో ఈ వార్తలను ఖండించిన ప్రభుదేవా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇక తనకు జీవితంలో ఆడతోడే అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు స్త్రీలంటేనే తనకు అయిష్టత కలుగుతోందన్నారు. మరి ప్రభుదేవాకు స్త్రీలంటే ఇంత విరక్తి కలగడానికి కారణం ఏమిటి? అనేది ఆసక్తి కరంగా మారంది.

నయనతారతో విడిపోయి తర్వాత
ప్రభుదేవా చివరి సారిగా లవ్ ఎఫైర్ కొనసాగించింది నయనతారతోనే. ఆమెతో విడిపోయిన తర్వాత అతను మరే స్త్రీకి దగ్గర కాలేదు.

విరక్తికి కారణం ఎవరు?
ప్రభుదేవాతో చివరగా సన్నిహితంగా గడిపింది నయనతారే కాబట్టి......అందరూ నయనతార మీదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ ఇద్దర మధ్య ఏం జరిగింది?
నయనతార, ప్రభుదేవా మధ్య విడిపోవడానికి కారణం ఏమిటి? ఇద్దరి మధ్య చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి అనేది ఇప్పటికీ సస్పెన్స్ గా ఉంది.

ఘాటుగా స్పందించిన ప్రభుదేవా
ఇతర హీరోయిన్లతో తనకు లింకు పెడుతూ వార్తలు రావడంపై ప్రభుదేవా ఘాటుగా స్పందించారు. ఇంతకాలం తనపై ఎన్ని వార్తలు వచ్చినా సైలెంటుగా ఉన్న ప్రభుదేవా ఈ సారి పెదవి విప్పారు. స్త్రీలంటేనే తనకు అయిష్టత కలుగుతోందని, ఇక జీవితంలో ఆడ తోడు అవసరం లేదని అన్నారు.


Click it and Unblock the Notifications











