»   » తమన్నా కోసం ప్రభుదేవా

తమన్నా కోసం ప్రభుదేవా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడు దక్షిణభారత సినిమా ఇండస్ట్రీలన్నీ హర్రర్ బాట పట్టాయి.ప్రేక్షకున్ని ఎంత భయపెడితే అన్ని డబ్బులు. అయితే భయపెట్టటం అంటే మాటలు కాదు. హర్రర్ నిజంగా మేకింగ్ లో టెర్రరే. ప్రతీ ఫ్రేం నీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నీ, నటుల ఎక్స్ప్రెషన్స్ నీ ఇలా ప్రతీ అంశాన్నీ జాగ్రత్తగా చూసుకుంటేనే ప్రేక్షకుడు భయ పడతాడు. థ్రిల్ల్ ఫీలౌతాడు. అప్పుడే కలెక్షన్లు లేదంటే అంతే..... త్రిపుర,చంద్రకళ, రాజుగారి గది... ఇలా వరుసగా హర్రర్ సినిమాలు క్లెక్షన్లు రాబట్టాయి... ఇక లారెన్స్ "ముని" సిరీస్ గురించి చెప్పనే అక్కరలేదు.. అదే లిస్ట్ లో ఇప్పుడు తమన్నా "అభినేత్రి కూడా చేరింది.

తమన్నా నాయికగా 'అభినేత్రి' సినిమా, షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సినిమాలో ఇంకో ప్రత్యేకథ ఏమిటంటే ప్రభుదేవా ఒక సాంగ్ లో మెరవనున్నాడు. ఈ రోజు నుంచి ప్రభుదేవా ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ లో ఎమీ జాక్సన్ మెరవనుంది. ఈ సినిమాకి ఈ సాంగ్ హైలైట్ గా నిలవనుందని అంటున్నారు.

Prabhu Deva introduction Song for Tamanna's Abhinetri

దాదాపు నాలుగు రోజుల పాటు ఈ పాటను ఇక్కడ చిత్రీకరించనున్నారు. 70 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా, తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. విజయ్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, హారర్ నేపథ్యంలో రూపొందుతోంది. ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలను ఎక్కువగా చేస్తూ వచ్చిన తమన్నా, మొదటిసారిగా హారర్ చిత్రంలో చేస్తోంది. మరి ఈ సినిమాతో ఆమె ప్రేక్షకులను ఏ మేర భయపెడుతుందో చూడాలి.

English summary
Prabhu Deva’s introduction song has been started at Ramoji Film City in Hyderabad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu