ముంబై డాన్సర్‌తో ప్రభుదేవా రెండో వివాహం?
హైదరాబాద్: ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారాడు. ముంబైకి చెందిన ఓ మహిళా కొరియోగ్రాఫర్‌తో ఆయన ప్రేమలో పడ్డారని, త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సినీ సర్కిల్లో వినిపిస్తున్నాయి. ప్రభుదేవా మొదటి వివాహం తనతో పాటు సినిమాల్లో పని చేసిన డాన్సర్ రమాలత్‌తో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఆ తర్వాత నయనతారతో ప్రేమలో పడ్డ ప్రభుదేవా మొదటి భార్యకు విడాకులిచ్చేసాడు. ప్రభుదేవా-నయనతార ప్రేమబంధం దాదాపు పెళ్లి వరకు వచ్చి పెటాకులైంది. అప్పటి నుండి ఒంటరిగానే ఉంటున్న ప్రభుదేవా బాలీవుడ్ సినిమాల్లో బిజీ అయిపోయారు. మళ్లీ ప్రభుదేవా పెళ్లి గురించిన వార్తలు వినిపిస్తుండటంతో హాట్ టాపిక్ అయింది.
ఒకనొక సమయంలో స్త్రీలంటేనే విరక్తి అనే స్థితికి వచ్చాడు ప్రభుదేవా. అప్పట్లో నయనతార, ప్రభుదేవా ప్రేమ వ్యవహారం ఓ సంచలనం. కొంతకాలం పాటు ఇద్దరూ పబ్లిక్‌గానే చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆ తర్వాత ఏమైదో తెలియదు కానీ ఇద్దరూ విడిపోయారు. అంత అన్యోన్యంగా ప్రేమించుకున్న వీరు విడిపోవడానికి దారితీసిన అంశాలు ఏమిటో ఇప్పటికీ బయటకు రాలేదు. ఇద్దరూ కూడా విడిపోయే ముందు ఒకరిపై ఒకరు నిందలు, విమర్శలు చేసుకోకుండా సైలెంటుగా ఎవరి దారి వారు చూసుకున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్లో దర్శకుడిగా బిజీ బిజీగా గడుపుతున్న ప్రభుదేవాకు పలువురు హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చారు. ఈ క్రమంలో ఈ వార్తలను ఖండించిన ప్రభుదేవా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇక తనకు జీవితంలో ఆడతోడే అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు స్త్రీలంటేనే తనకు అయిష్టత కలుగుతోందని వ్యాఖ్యానించాడు. అలాంటి ప్రభుదేవా మళ్లీ ప్రేమలో పడ్డాడనే వార్త చర్చనీయాంశం అయింది.
బాలీవుడ్లో ‘రౌడీ రాథోర్', ‘ఆర్...రాజ్ కుమార్' లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రభుదేవా ప్రస్తుతం అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతున్న హిందీ మూవీ ‘యాక్షన్ జాక్సన్' చిత్రం షూటింగుతో బిజీగా గడుపుతున్నారు.


Click it and Unblock the Notifications











