ప్రియురాలు వద్దు భార్యే ముద్దు..!(భార్య దగ్గరకు ప్రభుదేవా)
చెన్నయ్: నయనతారతో పీకల్లోతు ప్రేమలో పడి కుటుంబాన్ని సైతం కాదనుకున్న ప్రభుదేవా.. కాలం కలిసి రాకపోవడంతో.. భార్యతో తెగిపోయిన బంధాన్ని మళ్లీ కలుపుకొన్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇటీవల జరిగిన సంఘటనలు ఇది నిజమే అని చెబుతున్నాయి.
నయనతార మోజులో పడి కుటుంబాన్ని, భార్య పిల్లలను వద్దుకున్న ప్రభుదేవా తన భార్య రమాలత్‌తో విడాకులు కూడా తీసుకున్నారు. అనంతరం ప్రభుదేవా, నయనతార పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు కూడా. ప్రభుదేవా కోసం క్రైస్తవ మతం నుంచి హిందూ మతంలోకి మారిన నయనతార సినిమా రంగానికి కూడా దూరం అవ్వాలని నిర్ణయించుకుంది.
ఏమైందో ఏమోగానీ ఇద్దరి మధ్యా ఎడం పెరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయమై మీడియా కోడై కూయడంతో.. తామ మధ్య బంధం తెగిపోయిందని ఇద్దరూ వేర్వేరుగా బహిరంగంగా ప్రకటించారు. ఎవరి దారి వారు చూసుకున్నారు. సినిమాలు చేయనన్న నయనతార మళ్లీ వరుస సినిమాలకు సైన్ చేసింది.
ఒంటరిగా ఉంటున్న ప్రభుదేవా మళ్లీ కుటుంబానికి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్లో తన భార్య రమలత్‌ను కలసి మాట్లాడినట్టు తెలిసింది. జరిగిందేదో జరిగిందనుకుని, మళ్లీ కలిసి ఉంటూ కుటుంబ జీవితాన్ని సంతోషంగా గడపాలని నిర్ణయించుకున్నారట.


Click it and Unblock the Notifications