మెగాపవర్ స్టార్ కి డైరెక్ట్ చేయాలని ముచ్చటపడుతున్న ప్రభుదేవా..!
మెగాస్టార్ చిరంజీవితో 'టగేరహో మున్నాభాయ్"ని తెలుగులో 'శంకర్ దాదా జిందాబాద్"గా ప్రభుదేవా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమిళ, హిందీ భాషల్లో దర్శకుడిగా బిజీగా ఉన్న ప్రభుదేవా, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని డైరెక్ట్ చేయాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడట..ఈ మధ్యే రామ్ చరణ్ కు ఓ కథని కూడా వినిపించాడని సమాచారం. అయితే అది చరణ్ కి నచ్చలేదట..
దాంతో ఎలాగైనా రామ్ చరణ్ ని ఒప్పించి తనతో ఓ చిత్రం చేయాలనే పట్టుదలతో ప్రభుదేవా..మరో స్ర్కిప్ట్ ని రెడీ చేసే పనిలో ఉన్నాడట..ఒకవేళ అన్ని సెట్ అయి, ప్రభుదేవా ఈ చిత్రం సెట్స్ పైకి తీసుకురావడానికి..ప్రస్తుతం రామ్ చరణ్ ప్రస్తుతం సంపత్ నంది తో చేస్తున్న 'రచ్చ"..ఆ తర్వాత వివి వినాయక్ తో చేయబోతున్న ఓ భారీ యాక్షన్ చిత్రం, తర్వాత పూరిజగన్నాథ్ చిత్రాలు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే..మరి దర్శకుడిగా రెండు భాషల్లోనూ బిజీగా ఉన్న ప్రభుదేవా..రామ్ చరణ్ కోసం వేచి చూస్తాడా లేడా అన్నది అనుమానమే..


Click it and Unblock the Notifications











