ఫేస్ బుక్‌లో ప్రభుదేవాకు సమస్యలు
హైదరాబాద్: కొరియాగ్రాఫర్ నుంచి దర్శకుడుగా ఎదిగిన ప్రభుదేవా ప్రస్తుతం తనకు అఫీషియల్ గా ఫేస్ బుక్ లో ఏ ఎక్కౌంట్ లేదని ప్రకటించారు. తన పేరన ఫేక్ ఎక్కౌంట్స్ క్రియేట్ చేసి తమ ఇష్టం వచ్చినవి పోస్ట్ చేస్తున్నారని, అవి తన ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తున్నాయని తన దృష్టికి వచ్చిందని తెలియచేసారు.
అలాగే తనకు పర్శనల్ గా ఎక్కౌంట్ లేదని, తన ఫ్యాన్స్ www.facebook.com/PrabhuDevaFansOfficial అంటూ ఓ ఎక్కౌంట్ మెయింటైన్ చేస్తున్నారని,దాన్నే అఫీషియల్ గా భావించాలని తెలియచేసారు. ఫేక్ ఎక్కౌంట్ లను నమ్మి ప్రచారం చేయవద్దని రిక్వెస్ట్ చేసారు.
ప్రస్తుతం ప్రభుదేవా శృతి హాసన్ ప్రధాన పాత్రలో రామయ్య వస్తావయ్యా అనే చిత్రం హిందీలో రూపొందిస్తున్నారు. ఇటీవల 'రౌడీరాథోడ్'తో సినిమాతో బాలీవుడ్లో భారీ హిట్ కొట్టిన ప్రభుదేవా తాజాగా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో త్రిష చేసిన పాత్రకు గానూ శృతి హాసన్ ని ఎంపిక చేసారు. ఈ చిత్రం హిందీలో 'రామయ్య వస్తావయ్యా' అనే పేరుతో రూపొందుతోంది.
శ్రీలంక సెక్సీ బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఇందులో ఓ ఐటం సాంగు కోసం ఎంపిక చేసాడు ప్రభుదేవా. సినిమాలో హీరో హీరోయిన్ ఇంటికి వెళ్లేప్పుడు వచ్చే ఓ ప్రత్యేక గీతంలో ఆమె స్టెప్పులేయనుంది. అయితే లంక బ్యూటీని తీసుకోవడంపై తమిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











