త్రిష ముగ్గులో ప్రభుదేవా?
ప్రభుదేవా లేకుంటే నాకు సినీ పరిశ్రమలో చాలా కష్టమయ్యేది అంటూ ఆకాశానికి ఎత్తేస్తోంది త్రిష. తాజాగా గోపీచంద్ తో శంఖం చిత్రంలో చేస్తున్న త్రిష మీడియాతో మాట్లాడుతూ నాకు సినిమా ఫీల్డ్ లోకి వచ్చేటప్పుడు బ్యాలే డాన్స్ మాత్రమే తెలుసు..అయితే అది సినిమాలకు ఎంతమాత్రమూ పనికిరాదు. అయితే అదృష్టవశాత్తు ప్రభుదేవాతో పనిచేయటంతో ఆయనే నన్నుఎంకరేజ్ చేసి డాన్స్ నేర్పించారు. ఆయన నేర్పిన కొద్దిపాటి స్టెప్స్ తోనే నేను పరిశ్రమలో ఈజీగా సర్వైవ్ కాగలుతున్నా.
ఆయనతో చేసినవి కొద్ది సినిమాలే అయినా చాలా వండర్ ఫుల్ ఎక్సపీరియన్స్..చాలా నేర్చుకున్నా అని పొగిడింది. ఏంటి హఠాత్తుగా త్రిష కన్ను ప్రభుదేవాపై పడింది అంటే ఈ మధ్య ప్రభుదేవా..ఆమె రైవల్ కమ్ ప్రెండ్ నయనతారతో చనువుగా ఉంటున్నాడని ఆమెను అంతటా ఎంకరేజ్ చేస్తున్నాడని వినిపించటంతో ఈ కొత్త పాఠం మొదలెట్టిందంటున్నారు. అంటే ప్రభుదేవా..త్రిషకు కూడా అవకాశాలు ఇప్పించాలనే ఆమె ఆలోచన అంటున్నారు.


Click it and Unblock the Notifications











