ప్రభుదేవా కొత్త చిత్రం పై హాలీవుడ్ నిర్మాత నోటీస్

By Srikanya

హైదరాబాద్: ప్రభుదేవా దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా రూపొందిస్తున్న 'యాక్షన్ జాక్సన్' సినిమాకి టైటిల్ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇదే పేరుతో హాలీవుడ్‌లో 1988లో ఓ సినిమా వచ్చింది. కార్ల్ వెదర్స్, షరాన్ స్టోన్ ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమాని నిర్మించిన వార్నర్ బ్రదర్స్ సంస్థ ఇప్పుడు బాలీవుడ్ 'యాక్షన్ జాక్సన్' టైటిల్‌ను మార్చాల్సిందిగా ఆ సినిమా నిర్మాతలకు 48 గంటల నోటీసును పంపింది. భారత ఉపఖండానికి సంబంధించి కూడా ఆ టైటిల్ తమ వద్దే ఉందని వార్నర్ బ్రదర్స్ వాదిస్తోంది.

'యాక్షన్ జాక్సన్' నిర్మాతల్లో ఒకరైన గోర్డాన్ తన్వాని మాట్లాడుతూ... "ఏ అసోసియేషన్‌తోనైనా ఒక టైటిల్‌ను రిజిస్టర్ చేసినప్పుడు, భారత ప్రభుత్వం నుంచి ఆ అసోసియేషన్ క్లియరెన్స్ పొందుతుంది. మా సినిమా 70 శాతం పూర్తయింది. ఈ సమయంలో వాళ్లు నోటీసు పంపడమేంటి? ఏవైనా అభ్యంతరాలుంటే ముందే చెప్పాలి కానీ ఇప్పుడు చెప్పడమేంటి? నేను ఇండివిడ్యువల్ ప్రొడ్యూసర్‌ని కాబట్టి నాపై ఒత్తిడి తేవాలని చూస్తున్నారు. '' అని చెప్పాడు.

 prabhudeva

అలాగే వాళ్లు చాలా పెద్ద నిర్మాతలు. ఒక చిన్న నిర్మాతపై ఒత్తిడి తేవాలనేది వాళ్ల ఉద్దేశం. వాళ్లు నాకు కాకుండా నిర్మాతల సంఘాన్ని సంప్రదిస్తే బాగుండేది. నిర్మాతల సంఘంలో వాళ్లు కూడా సభ్యులే అయినప్పుడు సంఘాన్నే సంప్రదించాలి కదా. అలా కాకుండా నాకు నోటీసు ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అన్నారు.

ఈరోస్ ఇంటర్నేషనల్‌తో కలిసి బాబా ఆర్ట్స్ లిమిటెడ్ ప్రొడక్షన్ బేనర్‌పై ఈ సినిమాని ఆయన నిర్మిస్తున్నాడు. ఇందులో అజయ్ దేవగన్ జోడీగా సోనాక్షి సిన్హా నటిస్తుండగా, మరో జంటగా కునాల్‌రాయ్ కపూర్, యామీ గౌతమ్ నటిస్తున్నారు. ఇంతకు ముందు వచ్చిన ప్రబుదేవా చిత్రం రాంబో రాజకుమార్ కి సైతం టైటిల్ సమస్య ఎదురైంది. ఆర్... రాజ్‌కుమార్ - ఆర్. అంటే మొదట్లో రాంబో అన్నారు. అది కాస్తా - వివాదాన్ని సృష్టించటంతో రిజిస్టర్ చేసుకొన్న 'ఆర్'ని రోమియోగా మార్చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X