twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సచిన్ కోసం ప్రభుదేవా స్పెషల్ సాంగ్

    By Bojja Kumar
    |

    ముంబై : కొరియో గ్రాఫర్‌గా, ఆపై నటుడిగా, ఆ పై దర్శకుడిగా ఎదిగిన డాన్నింగ్ సెన్షేషన్ ప్రభుదేవా, కోట్లాది మంది ఇండియన్ క్రికెట్ అభిమానుల ఆరాధ్య దైవంగా మారిన సచిన్ టెండూల్కర్‌పై స్పెషల్ వీడియో సాంగు చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సచిన్ కెరీర్‌పై సాగే ఈ వీడియోలో ప్రభుదేవా అదరిపోయే స్టెప్పులతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు.

    ఈ వీడియోకు అరవింద్ రామలింగం దర్శకత్వం వహించనున్నాడు. ఎల్.వి.గణేషన్ ఈ సాంగును కంపోజ్ చేయబోతున్నారు. 'ధూల్ టక్కర్' పేరుతో ఈ వీడియో సాంగ్ త్వరలో విడుదల కానుంది. సచిన్ ఇటీవల వన్డే క్రికెట్ వీడ్కోలు పలకడం కోట్లాది మంది సచిన్ అభిమానులను నిరాశ పరిచింది.

    ఈ సందర్భంగా ప్రభుదేవా తన ట్విట్టర్లో స్పందిస్తూ..'సచిన్ టెండూల్కర్ ఒక లివింగ్ లెజెంట్. అతను వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవ్వడంతో తీరని లోటు. అతని క్రికెట్ జర్నీ ఎంతో గొప్పది. ఎన్నో విజయాలు అందించి, రికార్డులు బద్దలు కొట్టిన ఘనత ఆయనది. అతన్ని ఎంతో మిస్సవుతున్నాం' అంటూ ట్వీట్ చేసాడు.

    సచిన్ టెండూల్కర్ 463 వన్డే మ్యాచ్‌లు ఆడి 49 సెంచరీలు, 96 అర్థ సెంచరీలు చేసాడు. వన్డేల్లో 18,426 పరుగులు చేసిన సచిన్ 50 ఓవర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్లో లీడింగ్ స్కోరర్‌గా నిలిచారు. టెండూల్కర్ 2,016 ఫోర్లు, 195 సిక్సులు బాదాడు.

    English summary
    
 Dancing sensation Prabhu Deva, who is a huge fan of Sachin Tendulkar like millions of Indians, has paid his respect towards the legendary cricketer. The choreographer-turned-cricketer has come up with a special video, which is a tribute song to the God of Indian Cricket.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X