»   » నయనతారను వెంటాడుతున్న ప్రేమగుర్తులు (ఫోటోస్)

నయనతారను వెంటాడుతున్న ప్రేమగుర్తులు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ టాప్ హీరోయిన్ నయనతార, ప్రభుదేవా ప్రేమయాణం...ఆపై బ్రేకప్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సౌత్‌ సినీ చరిత్రలోనే గతంలో కనీవినీ ఎరుగని రీతిలో వీరి ప్రేమాయణం గురించిన విషయాలు ఆ మధ్య మార్మోగాయి. నయనతార కోసం ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇవ్వడం అప్పట్లో ఓ సంచలనం.

ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎంత ప్రేమ ఒలకపోసుకున్నారో మాటల్లో, రాతల్లో చెప్పడం కష్టమే. ప్రభుదేవా తనపట్ల చూపెడుతున్న లవ్వుకు ఫిదా అయిపోయిన నయనతార అతని పేరును తన చేతిపై పచ్చబొట్టు కూడా పొడిపించుకుంది. ప్రభుదేవానికి పెళ్లి చేసుకోవడానికి తన మతం మార్చుకుని హిందూ మతం కూడా స్వీకరించాలని నిర్ణయించుంది.

వీటన్నింటికంటే ముఖ్యంగా ప్రభుదేవా కోసం తనకు ఎంతో ప్రాణమైన సినిమాలకు కూడా దూరం కావాలని నిర్ణయించుకుంది. ఇలా ప్రభుదేవా కోసం ఎన్నో త్యాగాలు చేసింది నయనతార. ఏమైందో తెలియదు కానీ నయనతార మనసు విరిగిపోయింది. అతనితో తెగదెంపులు చేసుకుంది. ప్రభుదేవాతో విడిపోయి చాలా కాలం అయినా....నయనతారను అతని ప్రేమగుర్తులు వెంటాడుతూనే ఉన్నాయి. ఆమె చేతిపై ప్రభుదేవా పేరుతో ఉన్న టాటూ ఇంకా అలానే ఉంది.

ఇటీవల 'అమర కావ్యం' అనే తమిళ సినిమా ఆడియో ఫంక్షన్‌కు హాజరైన నయనతార ఆ టాటూ కనిపించేలా డ్రెస్ వేసుకుని రావడంతో అందరి దృష్టి ఆ టాటూపై పడింది. ప్రభుదేవాతో విడిపోయినా ఇంకా ఆమె ఆ టాటూను చెరిపేసుకోక పోవడం ఏమిటని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

టాటూ...

టాటూ...

నయనతార ఎడమ చేతిపై ప్రభుదేవా పేరుతో ఉన్న టాటూ ఇంకా అలానే ఉన్న దృశ్యన్ని ఇక్కడ ఫోటోలో గమనించవచ్చు.

నయనతార మనసులో ప్రభుదేవాకు స్థానం?

నయనతార మనసులో ప్రభుదేవాకు స్థానం?

నయనతార మనసులో ప్రభుదేవాకు ఇంకా స్థానం ఉందా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్న ఈ టాటూ చూసిన వారు.

నయనతార-శింబు బంధం

నయనతార-శింబు బంధం

ప్రభుదేవా కంటే ముందు నయనతార శింబుతో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. అతనితో విడిపోయిన తర్వాత ప్రభుదేవాకు దగ్గరైంది. అయితే నయనతార-శింబు పాత విషయాలు మరిచిపోయి మళ్లీ స్నేహితులయ్యారు. ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు కూడా.

నయనతార-గణేష్

నయనతార-గణేష్

నయనతార ప్రస్తుతం జయం రవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. ఈచిత్రంలో గణేష్ వెంట్రామన్ సెకండ్ హీరోగా చేస్తున్నారు. గణేష్ వెంకట్రామన్‌తో నయనతార సన్నిహితంగా మెలుగుతుండటంతో ఇద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ రిలేషన్ షిప్ ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

స్నేహితుల్లా...

స్నేహితుల్లా...

నయనతార, శింబు తమ పాత ఎపైర్ విషయాలను పూర్తిగా మరిచిపోయి ఇపుడు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు.

English summary
Lot has been written about Nayantara-Prabhu Deva's affair and their break up. Their relationship was the talk of the town at one point of time and they never tried to hid their relationship. They appeared together in public events and confessed, without any hesitation, that they were in love. But to everybody's surprise, something went wrong in their relationship and they got separated.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu