విరాట్ కోహ్లీని యాడ్‌లో సినిమా హీరోలా చూపించిన ప్రభుదేవా
ముంబై, జులై 13: ఇండియన్ మైఖెల్ జాక్సన్‌గా పేరు సంపాదించిన ప్రభుదేవా గత కొంత కాలంగా మైక్రో ఫోన్ పట్టి అటు బాలీవుడ్, ఇటు కోలీవుడ్ మరియు టాలీ వుడ్‌లో సినిమాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు కొత్తగా మరో అవతారం ఎత్తాడు. ఆ అవతారం ఏంటంటే టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో బ్యాంకాక్‌లో ఓ యాడ్ ఫిల్మ్ షూట్ చేశాడంట. ఈ యాడ్ ఫిల్మ్ ప్రభుదేవా తన జీవితంలో తొలిసారి యాడ్ ఫిల్మ్ కావడం విశేషం.
ఈ సందర్బంలో ప్రభుదేవా మాట్లాడుతూ నా జీవితంలో ఒక నిమిషం కన్నా తక్కువ సమయంలో కథ చెప్పిన ఈ యాడ్ ఫిల్మ్ ని షూట్ చేయడం చాలా ఉత్సాహంగా ఉందని.. ఈ యాడ్ ఫిల్మ్ నాకొక ఛాలెంజ్. ఎందుకంటే నేను అంతక ముందు యాడ్ ఫిల్మ్‌ని షూట్ చేయకపోవడమే. ఈ యాడ్ ఫిల్మ్ కున్న ప్రత్యేకత ఏమిటంటే సినిమా రంగంతో సంబంధం లేని ఒక క్రికెటర్‌తో ఈ యాడ్ ఫిల్మ్ షూట్ చేయడం అని అన్నారు.
ప్రభుదేవా ఇండియన్ స్క్రీన్‌పై ఓ యాక్టర్, ఓ కొరియో గ్రాఫర్, డ్యాన్సర్, డైరెక్టర్ అన్ని రంగాలలో అధ్బుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో చేసిన ఈ యాడ్ ఓ ప్రముఖ షూ కంపెనీకి చెందినదిగా భావిస్తున్నారు. ఈ యాడ్‌లో యాక్షన్ ఎక్కువ పాళ్లలో ఉండడమే కాకుండా... ఒక చిన్న బిట్ డ్యాన్సింగ్ కూడా ఉంటుందని అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యాడ్ ఫిల్మ్ విరాట్ కోహ్లీ సినిమా హీరో మాదిరి కనిపించనున్నారు.
ఇటీవల ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ సినిమా రౌడీ రాథోడ్ ఈ సినిమా బాక్సా ఫీసు వద్ద రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన రవితేజ్ విక్రమార్కుడు సినిమాకి రీమేక్. త్వరలో ఈ సినిమాకి ప్రభుదేవా కొనసాగింపుగా మరో సినిమా చేయనున్నట్లు సమాచారం.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications












