ఐటం బాయ్‌గా మారుతున్న ప్రభుదేవా
ఐటం సాంగులు చేయడానికి ఒకప్పుడు ప్రత్యేకంగా ఆర్టిస్టులుండే వారు. జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత, డిస్కో శాంతి లాంటి వారిని కేవలం పత్యేకంగా ఐటం సాంగులు చేయించడానికే వాడే వారు. ఒకప్పుడు ఐటం సాంగు అంటో సినిమాలోని ఓ బూతు పార్టు. కానీ రాను రాను పరిస్థితి మారి పోయింది. ఐటం సాంగులను కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుత జనరేషన్లో.
ఈ తరం దర్శకులు కూడా టాప్ హీరోయిన్లతో ఐటం సాంగులు చేయించడం మొదలు పెట్టారు. కత్రినా, కరీనాలతో మొదలైన ఈ సాంప్రదాయం ఇప్పుడు అన్ని భాషల ఇండస్ట్రీల్లోనూ కొనసాగుతోంది. చివరకు పరిస్థితి ఎలా తయారైంది అంటే హీరోయిలు కూడా ఐటం సాంగులు చేసేందుకు రెడీ అంటున్నారు.
తాజాగా కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా టర్న్అయిన ప్రభుదేవా త్వరలో ఐటంగా బాయ్‌గా టర్న్ కాబోతున్నారు. అతను తయారు చేసిన 'రౌడీ' అక్షకుమార్ రిక్వెస్ట్ మేరకు ప్రభుదేవా ఈ నిర్ణయం తీసుకున్నాడు. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందనున్న 'ఓ మై గాడ్' చిత్రంలో ప్రభుదేవా ఐటం సాంగు చేయబోతున్నాడు.
రాజమౌళి-రవితేజ కాంబినేషన్లో వచ్చిన 'విక్రమార్కుడు' చిత్రాన్ని హిందీలో రౌడీ రాథోడ్‌గా రీమేక్ చేసిన ప్రభుదేవా అక్కడ అక్కమంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈచిత్రం బాలీవుడ్లో 100 కోట్ల మార్కెట్ చేయడంతో ప్రభుదేవా రేంజ్ ఒక్కసారిగా పెరిగి పోయింది. ఆయన దర్శకత్వంలో చేసేందుకు టాప్ బాలీవుడ్ హీరోలు సుముఖంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











