ప్రభుదేవా కొత్త అవతారం...
కొరియో గ్రాఫర్ గా, యాక్టర్‌గా, దర్శకుడిగా ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను నిరూపించుకున్న ప్రభుదేవా త్వరలో మరో కొత్త అవతారం ఎత్తబోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా సింగర్ గా మార బోతున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో మ్యూజిక్ ఆల్బమ్ ను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఆల్బం చిత్రీకరణ జరుగనుంది. 7డి కెమెరాతో ఈ ఆల్బమ్ ను చిత్రీకరించనున్నారు. తన పాపులారిటీని మరింత పెంచుకోవడంలో భాగంగానే ప్రభుదేవా ఈ ఆల్బమ్ ప్లాన్ చేసినట్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుదేవా హిందీలో 'రౌడీ రాథోడ్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్ -సోనాక్షి సిన్హా జంటగా నటిస్తున్న ఈ చిత్రం.....గతంలో తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన 'విక్రమార్కుడు' చిత్రానికి రీమేక్.
ఇక ప్రభుదేవా పర్సనల్ విషయాలకొస్తే....నయనతారతో ప్రేమాయణంతో భార్యకు విడాకులు ఇచ్చిన ప్రభు త్వరలో నయనను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. అయితే వీళ్ల పెళ్లి జరుగడంపైనా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని, ప్రస్తుతం ప్రభుదేవాకు దూరంగా ఉంటున్న నయన మళ్లీ సినిమాలపై దృష్టిసారించిందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇటు వివాదాలు ఎదుర్కొంటూ, మరో వైపు సక్సెలతో దూసుకెళ్లడం ప్రభుదేవాకే చెల్లింది.


Click it and Unblock the Notifications











