రహస్యంగా కాదు..అదిరిపోయేలా చేసుకుంటా: నయన
తమ పెళ్లి కార్యం చూసి సినీ ప్రపంచం మొత్తం ఆశ్చర్యంతో ముక్కన వేలేసుకోవాలి అంటోంది మళయాల ముద్దుగుమ్మ నయన తార. రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి అగత్యం, అవసరం తమకు లేదని, అందరికీ తెలిసేలా అంగరంగ వైభవంగా చేసుకోనున్నట్టు స్పష్టం చేసింది. ప్రభుదేవాకు రెండో పెళ్లి అయినప్పటికీ, నాకు మాత్రం మొదటి పెళ్లే కదా , అలాంటప్పడు రహస్యంగా ఎందుకు చేసుకుంటాం? అని ఎదురు ప్రశ్నిస్తోంది. వీళ్ల పెళ్లి ఇటీవల ముంబైలో సీక్రెట్ గా జరిగిందని మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నయనతార పై విధంగా స్పందించింది.
ప్రభుదేవాను పెళ్ళి చేసుకొనే విషయంలో నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మేమిద్దరం ఫ్రీ బర్డ్స్. ప్రభుని పెళ్ళాడేందుకు ఎలాంటి అడ్డంకులు లేవఃని తేల్చి చెప్పింది. తమ వివాహానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని, దయచేసి తమ పర్సనల్ వ్యవహారాల్లో మీడియా అత్యుత్సాహం చూపడం మానుకోవాలని సూచించింది.


Click it and Unblock the Notifications











