‘గజరాజు’గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ప్రభు తనయుడు
హైదరాబాద్ : శివాజీ గణేషన్ వారసుడిగా, కేరక్టర్ ఆర్టిస్టుగా అటు తమిళంతో పాటు ఇటు తెలుగు సినిమాల్లోనూ రాణిస్తున్న ప్రభు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ప్రభు తనయుడు విక్రమ్ ప్రభు తెలుగు తెరకు 'గజరాజు' చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నాడు.
తమిళంలో విక్రమ్ ప్రభు, లక్ష్మీ మీనన్ జంటగా నటించిన 'కుమ్కి' చిత్రం తెలుగులో 'గజరాజు' పేరుతో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ విడుదల చేస్తున్నారు. మైనా(ప్రేమ ఖైదీ) ఫేం ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమిళంలో ఎన్.లింగుస్వామి, చంద్రబోస్‌లు నిర్మించగా బెల్లంకొండ సురేష్ అనువాద హక్కులు పొందారు.
డిసెంబర్ 14న 'గజరాజు' చిత్రాన్ని అటు తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఈ నెల 8న తెలుగు ఆడియో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ 'మా నాన్నగారిని, నన్ను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు మా అబ్బాయి తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. అతన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
డైరెక్టర్ కావాలని ఆశ పడ్డాడు. కానీ హీరో అయ్యాడు. హీరోగా విజయం సాధిస్తాడని ఆశిస్తున్నాను' అన్నారు. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ఏనుగు నేపథ్యంలో గతంలో తెలుగులో 'రాజేంద్రుడు గజేంద్రుడు' సినిమా వచ్చి హిట్టయింది. ఆ చిత్రం తర్వాత అలాంటి సినిమా మా 'గజరాజు' అన్నారు.


Click it and Unblock the Notifications












