»   » ప్రభుదేవా కొత్త అవతారం, ఇదిగో ఇదే... (ఫోటో)

ప్రభుదేవా కొత్త అవతారం, ఇదిగో ఇదే... (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా.... ఆ తర్వాత నటుడిగా, ఆపై దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుదేవా మరో కొత్త అవతారం ఎత్తారు. నిర్మాతగా మారారు. సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన ప్రొడక్షన్ హౌస్‌కు సంబంధించిన లోగోను విడుదల చేసారు.

‘ప్రభుదేవా స్టూడియోస్' పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్థాపిస్తున్నట్లు ప్రభుదేవా వెల్లడించారు. తమ బేనర్లో హై క్వాలిటీ, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తెరకెక్కించబోతున్నట్లు ప్రభుదేవా తెలిపారు. తమ బేనర్లో క్రియేటివ్ టాలెంట్ ఉన్న వారికి తమ బేనర్ ఒక మంచి ఫ్లాట్ ఫాంలా ఉంటుందని తెలపారు.

Prabhudeva turns producer

తమ బేనర్లో నిర్మించబోయే తొలి సినిమా గురించి ఆగస్టు 3న ప్రకటన చేస్తామని ప్రభుదేవా తెలిపారు. దేశ వ్యాప్తంగా టాలెంట్ ఉన్న వారిని గుర్తించి తమ బేనర్ ద్వారా అవకాశాలు కల్పిస్తామని, ఇప్పటి జనరేషన్లో దాగి ఉన్న టాలెంట్ వెలికి తీసేందుకు పలువురు ప్రముఖుల సహాయం తీసుకుంటానని ప్రభుదేవా తెలిపారు.

ప్రస్తుతం ప్రభుదేవా అక్షయ్ కుమార్ హీరోగా ‘సింగ్ ఈజ్ బ్లింగ్' అనే చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. అక్షయ్ కుమార్, దల్జీత్ దోసంజ్, అమీ జాక్సన్, లారా దత్తా, అర్పి లాంబ, వివేక్ ఒబెరాయ్, బిపాసా బసు తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని యార్డి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Prabhu Deva said that he set up Prabhu Deva Studios with a penchant for producing high quality and content oriented cinema.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu