దోష నివారణ పూజలు,అన్నదానం చేసిన ప్రభుదేవా
పూర్తి డ్యాన్స్ కథాంశంతో ప్రభుదేవా హీరోగా నటించిన 'ఎబిసిడి' అనే చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియాలో 3డిలో తీసిన పూర్తి డ్యాన్స్ కథాచిత్రమిదే. ఇంకా చెప్పాలంటే...హై ఓల్టేజ్ డ్యాన్స్ చిత్రమిది. కథాపరంగా డ్యాన్స్ మాస్టర్ అయిన ప్రభుదేవా ఇందులో ఒక గ్రూపుకు సారధ్యం వహిస్తారు. ఈ నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రేమ, యాక్షన్, వినోదం వంటి అంశాలున్నాయి. పూర్తిస్థాయి పాత్రను ఆయన ఈ చిత్రంలో పోషించారు. ఈ తరహా చిత్రాలను తియ్యడంలో సిద్ధహస్తుడైన రెమో డి.సౌజా దీనికి దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను ఒకేరోజు విడుదల చేయబోతున్నారు.
ఎబిసిడి (ఎనిబడీ కెన్ డ్యాన్స్) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం నృత్య నేపథ్యంలో సాగే తొలి 3డి చిత్రం అట. యూటీవీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నృత్య దర్శకుడు రెమోడిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. దీని గురించి ప్రభుదేవా తెలుపుతూ మళ్లీ నృత్యం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో గణేష్ ఆచార్యతో పాటు పలువురు ప్రముఖ నృత్య కళాకారులు నటించనున్నారని, వారితో కలసి తాను నటించడం గొప్ప అనుభూతి అని ప్రభుదేవా పేర్కొన్నారు. ఇందులో ప్రభుదేవాకు జంటగా అమెరికాకు చెందిన నృత్య కళాకారిణి, నటిలారెన్స్ కట్లాప్ నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఇదే పేరుతో కిషోర్ కుమార్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత కిషోర్ యూటీవి మోషన్ పిక్చర్స్ తో కలిసి తెలుగులో అందిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ 'ప్రముఖ డ్యాన్స్ మాస్టర్‌లు అంతా కలిసి నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది' అన్నారు. గణేష్ ఆచార్య, కెకె మీనన్, సల్మాన్ యూసఫ్‌ఖాన్, దర్మేష్ యేల, రాహుల్ షెట్టి, నూరిన్ షా, మోహెన కుమారి సింగ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సచిన్, సిగార్, ఛాయాగ్రహణం: విజయ్‌కుమార్ అరోరా, నిర్మాత: పి.కిషోర్, దర్శకత్వం: రెమో డి.సౌజా.


Click it and Unblock the Notifications












