అవకాసమొస్తే మహేష్ ని వదలనంటోంది

By Srikanya

ముంబై: 'రాక్ ఆన్', 'వన్స్‌ ఒపన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ఇండియా' వంటి చిత్రాలతో పాపులర్ అయిన బాలీవుడ్ బ్యూటీ ప్రాచీ దేశాయి అవకాసమొస్తే ప్రిన్స్ మహేష్ ని వదలనంటోంది. ఈ విషయం మీడియా వద్ద ప్రస్దావిస్తూ.. తాను రీసెంట్ గా ఈ హ్యాడసమ్ హీరో చేసిన ధమ్స్ అప్ యాడ్ చూసానని, తెగ నచ్చేసాడని, ఆ యాడ్ వస్తున్నప్పుడు టీవికి అతుక్కుపోతున్నానని చెప్తోంది. అలాగే అతని ప్రక్కన ఆఫర్ కనుక వస్తే ఎట్టి పరిస్దితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదు అంటోంది. ఇంతకీ మహేష్ ఈ మాటలు విని ఆమెకు ఆఫర్ ఇస్తాడో ఏంటో ఆమె ఆశ.

ప్రస్తుతం మహేష్. హీరోగా 14రీల్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. సుకుమార్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని మహేష్‌ జన్మదినం సందర్భంగా ఆగస్టు 9న విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. కృతి సనన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం మంచి విజయం సాధించటంతో ఈ సినిమాకు బిజినెస్ సైతం ఓ రేంజిలో జరుగుతోందని టాక్. ఈ చిత్రం అనంతరం క్రిష్ దర్శకత్వంలో శివమ్ చిత్రం చేస్తారు. పీరియడ్ చిత్రంగా ఆ సినిమా తెరకెక్కనుంది. సోనాక్షి సిన్హా.. మహేష్ సరసన చేయటానికి కమిటైనట్లు సమాచారం.

అలాగే... ఈ చిత్రంతో పాటు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఆగడు చిత్రం రూపొందనుంది. దూకుడుతో ఈ కాంబినేషన్ తెలుగు పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో శ్రీనువైట్ల బాద్షా అనంతరం ఈ చిత్రాన్ని తెరకెక్కింటానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మరో ప్రక్క పూరీ జగన్నాధ్ సైతం తన ఇద్దరమ్మాయిలుతో చిత్రం అనంతరం మహేష్ తో ఓ చిత్రం చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X