యాంకర్ ప్రదీప్ గురించి దారుణమైప వార్త .. సోషల్ మీడియాలో రూమర్లు.. నో అంటున్న సన్నిహితులు..
వాస్తవం గడప దాటక ముందే అబద్దం ప్రపంచం చుట్టేస్తుందనే విధంగా యాంకర్ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మారింది. కొత్త సంవత్సరం (ఆదివారం) అర్ధరాత్రి పోలీసులకు పట్టుబడిన తర్వాత నుంచి ప్రదీప్ కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కనపడకపోయే సరికి అనేక రూమర్లు సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.
Recommended Video


రూమర్లు వైరల్
యాంకర్ ప్రదీప్‌పై రూమర్లు ఏ స్థాయికి వెళ్లాయంటే అవమానాన్ని భరించలేక ఆయన ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారని ఓ దినపత్రికకు చెందిన వెబ్‌సౌట్ కథనాన్ని ప్రచురింంచింది.

ప్రదీప్‌కు డెడ్‌లైన్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మందుబాబులకు బుధవారం వరకు పోలీసులు డైడ్‌లైన్ విధించారు. అయితే బుధవారం వరకు వస్తారా అనే విషయంపై వేచి చూశారు. కానీ ఆయన కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోవడంతో అనేక అనుమానాలు తలెత్తాయి.

వ్యవహారశైలి కారణంగానే
ప్రదీప్ సూసైడ్ అటెంప్ట్ చేశాడని సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు ఆయన వ్యవహారశైలి బలంగా మారింది. దీంతో ఆయన బయటకు వచ్చి తగిన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.

కొట్టిపడేస్తున్న సన్నిహితులు
యాంకర్ ప్రదీప్ ఆత్మాహత్యాయత్నం వార్తను ఆయన సన్నిహితులు తేలిగ్గా తీసుకొని కొట్టిపడేస్తున్నారు. ఎంతో మందికి యువతకు స్ఫూర్తిగా నిలిచిన ప్రదీప్ ఆత్మహత్య చేసుకోవడం ఏమిటనే మాటను వినిపిస్తున్నారు.

మద్యం దేశద్రోహమేమీ కాదుగా
మద్యం సేవించి వాహనం నడపటం దేశద్రోహమేమి కాదుగదా. అంతగా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని మిత్రులు ప్రదీప్‌కు అండగా నిలుస్తున్నారు.

మీడియా అటెన్షన్‌తోనే..
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసును ప్రదీప్ పెద్దగా పట్టించుకోవడం లేదట. న్యూ ఇయర్ వేడుకల్లో ఫ్రెండ్స్‌తో కలిసి కాస్తా ఎక్కువ మోతాదులో మద్యం పుచ్చుకోవడం తప్పేమీ కాదు. కాకపోతే నిబంధనలకు విరుద్దంగా నడపడం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో మీడియా అటెన్షన్ తనపై ఉండటంతో బయటకు రావడానికి సంకోచిస్తున్నట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











