అద్భుతం చూపిస్తామని చెప్పలేదు.. ’30 రోజుల్లో’ గురించి యాంకర్ ప్రదీప్ షాకింగ్ కామెంట్స్
యాంకర్ ప్రదీప్ మాచిరాజు నటించిన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? చిత్రం జనవరి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో ముందుకెళ్తున్నది. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ తర్వాత జనవరి 30 రోజున చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్బంగా హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ...

రెండో రోజు కూడా మంచి రెస్సాన్స్
ప్రేక్షకులు పెద్ద మనసు చేసుకొని చిన్న సినిమాకు భారీ స్పందననకు వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు, అన్ని వర్గాల వారు సినిమాను ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రెండో రోజు కూడా మంచి రెస్సాన్స్ ఉంది. ఈ సినిమాను ఆదరిస్తున్న మహిళలు, యువతకు నా ధన్యవాదాలు అంటూ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఎమోషనల్ అయ్యారు.

తొలి రోజున రూ.4 కోట్ల గ్రాస్ వసూళ్లు
తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.4 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. నిర్మాతకు వసూళ్లు ఆనందం కలిగిస్తే.. మాకు మాత్రం ఆ లెక్కలు 40 కోట్ల చప్పట్లుగా భావిస్తున్నాం. రెండో రోజు కూడా మార్నింగ్ షోలకు మంచి స్పందన లభిస్తున్నట్టు వార్తలు అందుతున్నాయి అని ప్రదీప్ చెప్పారు.

రెండు గంటల పాటు వినోదమే
ఇక 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే సినిమా విషయానికి వస్తే అద్భుతం అందిస్తామని చెప్పలేం. థియేటర్‌కు వస్తే ఆశ్చర్యం కలిగిస్తామని చెప్పలేదు. కేవలం ఫ్యామిలీ మొత్తం సినిమా చూసి రెండు గంటల వినోదాన్ని మాత్రమే అందిస్తామని చెబుతున్నాం. మంచి అనుభూతిని కలిగిస్తాం అని ప్రదీప్ మాచిరాజు పేర్కొన్నారు.

రిలీజ్ వాయిదా పడితే బెంగ పడలేదు
30 రోజుల్లో ప్రేమించటం ఎలా! రిలీజ్ ఆగిపోయింది. దాదాపు 9 నెలలపాటు రిలీజ్ వాయిదా పడింది. అయినా యూనిట్ మొత్తం తమ విశ్వాసాన్ని కోల్పేదు. సినిమా విజయంపై అందరూ ధీమాగా ఉన్నారు. ఈ సినిమా కోసం దర్శకుడు మున్నా చాలా కష్టపడ్డారు. స్క్రిప్ట్ దశలో ఇంటికి వెళ్లకుండా ఆఫీస్‌లోనే ఉన్నారు అని ప్రదీప్ ఉద్వేగానికి లోనయ్యారు.

నీలి నీలి ఆకాశం పాట కారణంగానే...
30 రోజుల్లో ప్రేమించటం ఎలా చిత్రంలో అమ్మ పాటకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. అనంత శ్రీ రామ్ రాసిన ఈ పాట అమ్మ పాటల్లో టాప్‌గా నిలుస్తుంది. అనూప్ రూబెన్స్ అందించిన నీలి నీలి ఆకాశం పాట ప్రేక్షకులను సినిమా వరకు తీసుకొచ్చింది అంటూ ప్రదీప్ మాచిరాజు అన్నారు.


Click it and Unblock the Notifications











