ఇంతకీ ...'గజనీ' అమీర్ ఖాన్ కాదా?

By Staff

Aamir Khan
సూర్య హీరోగా తమిళ,తెలుగు భాషల్లో సూపర్ హిట్టయిన 'గజనీ' చిత్రాన్ని అమీర్ ఖాన్ హీరోగా ...మురుగదాస్ తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో గజనీ మాత్రం ప్రదీప్ రావత్ ట. ప్రతీదీ డిఫెరెంట్ గా వెరైటీగా ఉండాలని కోరుకునే అమీర్ ఖాన్ ఈ మార్పు చేసాడుట. అంటే విలన్ గా చేస్తున్న ప్రతీద్ రావత్ పేరు చిత్రంలో గజనీ అని ఉంటుందిట. అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఈ మార్పు జరిగిందిట.

మొదట్లో టైటిల్ జస్టిఫికేషన్ కోసం అమీర్ ఖాన్ గజనీ అనుకున్నారుట. అంటే గజనీ మహమ్మద్ అప్పట్లో చాలా సార్లు మనదేశంపే పట్టు విడవకుండా దాడి చేసి గెలిచాడు. అలాంటి పట్టు దల కలవాడే హీరో అని మురుగదాస్ ఉద్దేశమట. అయితే అతిగా ఆలోచించిన అమీర్ ఖాన్ ఈ టైటిల్ గజనీ అనేది నెగిటివ్ సెన్స్ లో వస్తుంది కాబట్టి విలన్ కి పెట్టాలనీ,అందులోనూ కథ ప్రకారం విలనే మంచి వాడైన హీరోపై పట్టు విడవకుండా పలు సార్లు దాడి చేస్తాడు కాబట్టి అతనికే పెట్టాలని డిసైడ్ చేసారుట.

అంతే గాక ప్రేక్షకులు ఈ చిత్రం టైటిల్ విని ఇందులో హీరో పేరు మహ్మద్ అని గానీ గజనీ అని గానీ పొరబడే అవకాశముందని అన్నాడు. దీనిపై మురుగదాస్ స్పందిస్తూ ...అమీర్ పేరు మార్చాలనే ఆలోచన లేదా డెసిషన్ చాలా బాగుంది. తమిళంలో హీరో కి ఆ పేరు సింబాలిక్ గా పెట్టటానికి కారణం స్ట్రాగ్ గా,పరవ్ ఫుల్ గా ఉంటాడని..అదే ఇక్కడ విలన్ కి పెట్టారు...అంతే అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X