twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గజని'ఎలా మొదలైందంటే...

    By Staff
    |

    Amir Khan
    అమీర్ ఖాన్ హీరోగా చేసిన 'గజనీ' చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కురిపిస్తోంది. ఈ సందర్భంలో అసలు గజనీ చేయాలనే ఆలోచన అమీర్ కి ఎలా పుట్టిందో చెప్పుకొచ్చాడు. తనతో పాటు లగాన్,సర్ఫరోష్ చిత్రాలో చేసిన ప్రదీప్ రావత్ ఓ సారి దీపావళి పంక్షన్ కి అమీర్ ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆయన తమిళ గజనీ చేస్తున్నాడు. అందులో ఆయన విలన్. ఆ క్యారెక్టర్ తన లైఫ్ మలుపు తిప్పుతుందని చెప్పుకొచ్చాడు.దాంతో ఆసక్తిగా అమీర్ ఆ సినిమా వివరాలు అడిగాడు. తనకు అప్పటికి తెల్సిన తన క్యారెక్టర్ మాత్రమే చెప్పుకొచ్చాడు. తర్వాత ఓ రోజు ఫోన్ చేసి గజనీ సూపర్ హిట్టని చెప్పాడు.

    అంతేగాక ఆ సినిమాను హిందీలోకి రీమేక్ చేసే ఆలోచన నిర్మాతలు చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. వెంటనే అరగంటలో దాని వివరాలు కనుక్కున్న అమీర్ చెన్నైలోని నిర్మాతలను కాంట్రాక్ట్ చేసాడు. అంతేగాక ప్రింటు తెప్పించుకు చూసాడు.అయితే వెంటనే మెటీరియలైజ్ కాలేదు. ఆ తర్వాత కొంత కాలానికి ఆ నిర్మాతలు మళ్ళీ అమీర్ నే సంప్రదించారు. తాము రైట్స్ అల్లుఅరవింద్ కి ఇవ్వటం జరిగిందని చెప్పారు. ఆ తర్వాత కథ తెలిసిందే. అందుకే ఆ సినిమాలో మెయిన్ పాత్రలైన అసిన్,ప్రదీప్ రావత్ లను మార్చబుద్ది కాలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

    అలాగే ఈ సినిమాను ఇప్పుడు స్పానిష్ భాషలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు. ఎందుకు స్పానిష్ లోనే చేద్దామనుకుంటున్నారు..అంటే అందరూ సినిమా హిట్టయితే జర్మనీలో రిలీజ్ చేద్దామనుకుంటారు.కానీ మన ఎమోషన్స్ కి స్పానిష్ కి ఒకేలా ఉంటాయని అన్నారు.అంతేగాక ఇంగ్లీష్ తర్వాత స్పానిష్ బాషే ఎక్కువ మంది మాట్లాడతారని అన్నారు.ఇదంతా ఆయన ప్రతినిధి ద్వారా అమీర్ ఖాన్ మీడియాకి వివరించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X