ప్రగతి ఒంటి మీద ఉన్న ట్యాటూలివే.. వాటి అర్థాలు ఏంటంటే?.. గుట్టు విప్పిన నటి

కరోనా లాంటి కష్టకాలంలో నటి ప్రగతి మాత్రం దుమ్ములేపింది. నటిగా బిజీ కావడంతో ఎప్పుడూ కూడా ఫ్యామిలీతో ఇంత సరదగా సమయాన్ని గడపడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అయితే లాక్ డౌన్‌లో దొరికిన ఈ అద్భుత సమయాన్ని ప్రగతి బాగా వాడుకుంది. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుని అభిమానులను సంపాదించుకుంది. కొత్త ప్రగతిని చూసి ఎంతో మంది ఆమెను ఇంకా ఫాలోఅవుతున్నారు. స్ఫూర్తిని పొందుతున్నారు.

Recommended Video

Actress Pragathi Rhythmically Moving her Hips, Dance Video Viral
 వర్కౌట్లు, డ్యాన్సులు..

వర్కౌట్లు, డ్యాన్సులు..

ప్రగతి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తూ వస్తోంది. మాస్ స్టెప్పులు, ఈ వయసులోనూ వర్కౌట్లు, ఫిట్ నెస్ మెయింటెన్ చేయడం, వీటికి సంబంధించిన వీడియోలను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తెరపై చూసే ప్రగతికి, సోషల్ మీడియాలో కనిపించే ప్రగతికి ఉన్న తేడాను చూసి అందరూ అవాక్కయ్యారు.

అది కేవలం నటన..

అది కేవలం నటన..

తెరపై మోడ్రన్ అమ్మగా, అత్తగా కనిపించి ఆకట్టుకున్న ప్రగతి ఒక్కసారిగా ఇలా కనబడటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. వీటిపై ప్రగతి స్పందిస్తూ.. తెరపై తాను కేవలం నటిస్తానని, అయితే తనకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అదే ఇదే అని తెలిపింది. డ్యాన్సులు చేయడం ఇష్టం, ఫిట్‌గా ఉండటం ఇష్టమంటూ చెప్పుకొచ్చింది.

ఇక టాటూలు సైతం..

ఇక టాటూలు సైతం..

సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి టాటూలపై కొంత పిచ్చి ఉంటుంది. హీరో హీరోయిన్లు టాటూలు వేయించుకోవడమన్నది కామన్. త్రిష, అనసూయ వంటి వారికి ఎదపై, నాగార్జునకు భుజంపై ఉన్న టాటూలు ఎంతగా ఫేమస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ మధ్య ప్రగతి భుజంపై ఉన్న టాటూ, చేతిపై ఉన్న టాటూ బాగానే వైరల్ అయింది.

 వాటి అర్థమిదే..

వాటి అర్థమిదే..

చిన్నప్పుడు భుజానికి టీకా వేశారని, అక్కడ మరక ఉండటంతో టాటూ వేయించానని ప్రగతి తెలిపింది. అయితే అది వేసినప్పుడు తెలీదని, కానీ ఆ సూర్యుడిలోని శక్తే నాలోనూ ప్రవహిస్తూ, ఎప్పుడూ ఎనర్జీ ఇస్తోందంటూ భుజంపై ఉన్న సూర్యుని టాటూ రహస్యం తెలిపింది.

 చేతులపైనా..

చేతులపైనా..

ఇక చేతులపైనా ప్రగతికి రెండు టాటూలు ఉన్నాయి. అందులో మోచేతికి చేతికి మధ్యలో ఓ టాటూ ఉండగా.. అది బెస్ట్ ఫ్రెండ్‌కు గుర్తుగా వేయించుకుందట. తనకు, తన స్నేహితురాలికి ఇద్దరికీ ఒకటే టాటూ ఉంటుందట. ఇక ఉంగరం పెట్టుకునే వేలిపై ఉన్న టాటూకు అర్థం క్వీన్ అట. తనకు తాను గుర్తుకు తెచ్చేలా అది ఉంటుందని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X