»   » లక్కు కోసమా? కిక్కు కోసమా? అడిగి మరీ డైరెక్టర్‌తో హీరోయిన్ శృంగార సీన్లు!

లక్కు కోసమా? కిక్కు కోసమా? అడిగి మరీ డైరెక్టర్‌తో హీరోయిన్ శృంగార సీన్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి హీరోయిన్లను సెక్సీగా, అందంగా, శృంగార దేవతలా చూపించడంతో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావును మించిన డైరెక్టర్ దాదాపుగా లేరనే చెప్పాలి. అసభ్యతకు చోటు లేకుండా హీరోయిన్లతో తెరపై శృంగార రసం ఒలికించడంలో ఆయన చాలా మంది యువత దర్శకులకు ఆదర్శం.

హీరోయిన్ల నడుము, నాభి(బొడ్డు) భాగాన్ని అందంగా చూపిస్తూ పూలు, పండ్లు లాంటి వాటితో టచ్ చేస్తూ ఆ సీన్లను రస రమ్యంగా చూపించి ప్రేక్షకులకు కిక్కెక్కించడం ఆయన స్టైల్. అాలా ఆయన పరిచయం చేసిన చాలా మంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్ల రేంజికి వెళ్లారంటే... రాఘవేంద్రావు వారిని తెరపై ప్రజెంట్ చేసిన విధానమే. అందుకే ఆయనతో ఒక్క సినిమా అయినా చేసే అవకాశం రావాలని కోరుకునే భామలు ఎందరో.

'ఓం నమో వెంకటేశాయ' సినిమా ద్వారా ప్రగ్యా జైస్వాల్ కు రాఘవేంద్రరావుతో చేసే అవకాశం దక్కింది. సినిమా అవకాశం రాగానే ఎగిరి గంతేసిన ఆమె.... ఈ సినిమాలో తనపై కూడా సెక్సీ సీన్లు ఉంటాయని ఆశ పడింది. అయితే దర్శకేంద్రడు ఈ సినిమాలో హీరోయిన్ నడుము, బొడ్డుపై అలాంటి సీన్లు చేయాలని అనుకోవడం లేదని తెలిసి ప్రగ్యా జైస్వాల్ నిరాశ పడింది.

 అండిగీ మరీ బొడ్డు మీద సీన్లు

అండిగీ మరీ బొడ్డు మీద సీన్లు

రాఘవేంద్రరావు సర్ తో అవకాశం రాగానే చాలా సంతోషించాను. ఓం నమో వెంకటేశాయ సినిమాలో నాపై ఓ సాంగ్ చిత్రీకరించారు. నడుము, బొడ్డుపై ప్లవర్స్, ఫ్రూట్స్ తో సీన్లు చేయడం లేదని తెలిసింది. వెంటనే ధైర్యం చేసి సర్ దగ్గరికి వెళ్లి అడిగాను. అలాంటి సీన్లు ఉంటేనే నాకు మరింత గుర్తింపు వస్తుందని కోరాను. నా కోరిక మేరకు ఆయన ఆ పాటలో ఆ సీన్లు పెట్టారు అని ప్రగ్యా జైస్వాల్ ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు.

 లక్కు కోసమే

లక్కు కోసమే

అలా అడగటంలో నా స్వార్థం కూడా ఉంది. రాఘవేంద్రరావు గారితో అలాంటి సీన్లు చేసిన హీరోయిన్లు కోరీర్లో బాగా ఎదిగారు. నాకు కూడా కెరీర్ పరంగా కలిసొస్తుందనే ఆ సీన్లు చేయమని అడిగాను అని ప్రగ్యా జైస్వాల్ అన్నారు.

 హీరోయిన్ గా

హీరోయిన్ గా

మిర్చిలాంటి కుర్రాడు సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్.... కంచె సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో ఆమె అందం, నటన చూసిన రాఘవేంద్రావు ఓం నమో వెంకటేశాయలో చాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం నక్షత్రం, గుంటూరోడు చిత్రాల్లో నటిస్తోంది.

జబల్పూర్ భామ

జబల్పూర్ భామ

మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జన్మించిన ప్రగ్యా జైస్వాల్... మోడలింగ్ రంగం నుండి బాలీవుడ్ సినిమాల ద్వారా కెరీర్ ప్రారంభించింది. 2014లో టిటు ఎంబీఏ ఆమె నటించిన తొలి సినిమా.

English summary
"That's the third day of shooting with KRR sir and we're canning a song. But actually he's not making any flower or fruit thrown at my navel or waist, that's why I took courage to ask him to hit my navel with them", said Pragya Jaiswal, who feels that KRR's navel-hit will give her a stroke a luck.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu