సైరాలో వరుణ్ తేజ్ హీరోయిన్‌కి ఛాన్స్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తుం సైరా నరసింహా రెడ్డి చిత్రం దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలా నరసింహా రెడ్డి జీవిత గాధ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఈతరహా పాత్రలో నటించడం ఇదే తొలిసారి. రాంచరణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
బాలీవుడ్ మెగాస్టర్ అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి ప్రముఖ నటులంతా ఈ చిత్రంలో భాగం కాబోతున్నారు. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మరో ఇద్దరు హీరోయిన్లకు కూడా అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో హీరోయిన్ గా ప్రగ్యాజైస్వాల్ పేరు వినిపిస్తోంది. ప్రగ్యాజైశ్వాల్ ఈ విషయం గురించి అడిగితే సస్పెన్స్ లో పెట్టేసింది.

తాను మెగాస్టార్ సైరాలో నటించే అవకాశం ఉందని ప్రగ్యా తెలిపింది. ఈ విషయాన్ని అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తానని ప్రగ్యాజైశ్వాల్ తెలిపింది. వరుణ్ తేజ్ నటించి కంచె చిత్రంతో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది. సరైన సక్సెస్ లేకపోవడంతో ప్రగ్యాజైశ్వాల్ కు పెద్ద చిత్రాల్లో అవకాశం రావడం లేదు. ప్రగ్య జైస్వాల్ నటించిన ఆచారి అమెరికా యాత్ర చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











