twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pushpa మూవీపై ఇండియన్ క్రికెటర్ ట్వీట్: అప్పట్లో అలా.. ఇప్పుడిలా అంటూ ఊహించని విధంగా!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా బాట పడుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు భారీ నుంచి అతి భారీ చిత్రాలతో అన్ని భాషల ప్రేక్షకులనూ పలకరించారు. అలాగే, మరికొందరు నటులు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్యనే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప' మూవీతో తన స్టామినాను దేశం మొత్తానికి పరిచయం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

    ఎన్నో అంచనాలతో ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో కలెక్షన్లు కూడా అత్యధికంగా వసూలు అయ్యాయి. ఫలితంగా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా పుష్పపై ఇండియన్ క్రికెటర్ ట్వీట్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

    పుష్పగా ఎంట్రీ రచ్చ చేసిన బన్నీ

    పుష్పగా ఎంట్రీ రచ్చ చేసిన బన్నీ

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. సునీల్, అనసూయ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్స్ చేశారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.

    జాకెట్ తీసేసి రచ్చ చేసిన రష్మిక మందన్నా: ఘాటు ఫోజుతో కసిగా కవ్విస్తోన్న హీరోయిన్జాకెట్ తీసేసి రచ్చ చేసిన రష్మిక మందన్నా: ఘాటు ఫోజుతో కసిగా కవ్విస్తోన్న హీరోయిన్

    అన్ని చోట్లా సూపర్ డూపర్ హిట్

    అన్ని చోట్లా సూపర్ డూపర్ హిట్

    క్రేజీ కాంబినేషన్‌లో పాన్ ఇండియా వచ్చిన 'పుష్ప' మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కింది. ఇలా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా ఊహించని రీతిలో కలెక్షన్లను కొల్లగొడుతూ రికార్డులు నమోదు చేసింది.

    టార్గెట్ కంప్లీట్.. లాభం ఎంతంటే

    టార్గెట్ కంప్లీట్.. లాభం ఎంతంటే

    ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 22 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 163.02 కోట్లు వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 17.02 కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుంది.

    ఒంటిపై నూలుపోగు లేకుండా ఇలియానా రచ్చ: ఇది మామూలు అరాచకం కాదుగా!ఒంటిపై నూలుపోగు లేకుండా ఇలియానా రచ్చ: ఇది మామూలు అరాచకం కాదుగా!

    అమెజాన్‌లో మొదలైన స్ట్రీమింగ్

    అమెజాన్‌లో మొదలైన స్ట్రీమింగ్

    ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పుష్ప' దాదాపు మూడు వారాల పాటు థియేటర్లలో సందడి చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో శుక్రవారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇది తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనే ప్రసారం అవుతుంది. హిందీ వెర్షన్ మరికొన్ని రోజుల తర్వాత రాబోతుంది.

    పుష్పపై క్రికెటర్ ప్రశంసల వర్షం

    పుష్పపై క్రికెటర్ ప్రశంసల వర్షం

    పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన 'పుష్ప' మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. అంతేకాదు, ఈ సినిమాపై సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా దీన్ని ఇండియాన్ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా చూశాడు. ఈ మేరకు అతడు చిత్ర యూనిట్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ కూడా చేశాడు.

    షర్ట్ మొత్తం విప్పేసి అఖండ హీరోయిన్ రచ్చ: ఘాటు ఫోజులో అందాలన్నీ చూపిస్తూ అలా!షర్ట్ మొత్తం విప్పేసి అఖండ హీరోయిన్ రచ్చ: ఘాటు ఫోజులో అందాలన్నీ చూపిస్తూ అలా!

    అప్పుడలా ఇప్పుడిలా అంటూ

    అప్పుడలా ఇప్పుడిలా అంటూ

    'పుష్ప' మూవీని చూసిన తర్వాత హైదరాబాద్‌కు చెందిన క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా 'అప్పట్లో పుష్ప.. నాకు కన్నీళ్లు నచ్చవు అనే బ్లాక్‌బస్టర్ డైలాగ్ ఉండేది. ఇప్పుడు పుష్ప.. పుష్పరాజ్.. నీఅవ్వ తగ్గేదేలే అనే డైలాగ్ వచ్చింది. నిజంగా నీ యాక్టింగ్ నాకెంతో నచ్చింది అల్లు అర్జున్' అంటూ ట్వీట్ చేశాడు. దీనికి బన్నీ కూడా 'థ్యాంక్స ప్రజ్ఞాన్ ఓజా గారూ' అంటూ రిప్లై ఇచ్చేశాడు.

    English summary
    Tollywood Star Hero Allu Arjun Did Pushpa Under Creative Director Sukumar Direction. Now Indian Cricketer Pragyan Ojha Post Review on this Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X