దక్షిణాదిలోనే "మహారాజ" మౌళి!
ప్రముఖ తెలుగు దర్శకుడు రాజమౌళికి భారత సినిమా ప్రముఖులు నీరాజనాలు పట్టారు. ఫిక్కీ మీడీయా అండ్ ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్ సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం ఇచ్చారు. సినిమా స్క్రిప్టులో స్క్రీన్ ప్లే లో వస్తున్న ఆధునిక పోకడలపై ఆయన తన అభిప్రాయాలను విన్పించారు. మణిరత్నం, గోవింద్ నిహలానీ వంటి అగ్ర దర్శకులతో రాజమౌళి ఇంటరాక్ట్ అయ్యారు. ఇంత చిన్న వయసులో రాజమౌళి ఇన్ని విజయాలు సాధించడంపై వారు ప్రశంసించినట్టు తెలుస్తోంది.
త్వరలో భారతీయ సినిమాలు కూడా అంతర్జాతీయంగా మోత మోగించగలవన్న విశ్వాసాన్ని రాజమౌళి తన ప్రసంగంలో వ్యక్తం చేశారు. "మగధీర" సినిమా రూపకల్పనలో రాజమౌళి చూపిన ప్రతిభను పలువురు ప్రశంసించారు. డిసెంబర్ లో మగధీర శతదినోత్సవం జరుగనుంది.
రాజమౌళి మగధీర మణిరత్నం స్క్రిప్టు దర్శకత్వం ఉపన్యాసం ఫిక్కీ rajamouli magadheera maniratnam script direction speech ficci


Click it and Unblock the Notifications