twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీ తమ్ముడితో పోలిస్తే మీరు బాహుబలి: చిరంజీవికి ఆర్జీవీ కాంగ్రాట్స్, లోకేష్ ఫన్నీ వీడియో!

    |

    2019 ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఏపీలో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతారని వేసిన అంచనాలు తారుమారయ్యాయి. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. 175 సీట్లలో 2 సీట్లు దక్కించుకోవడమే గగనంగా ఉంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు.

    గురువారం మధ్నాహ్నం 3 గంటల వరకు అందిన ఫలితాల ప్రకారం దాదాపు 150 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ 23 స్థానాల్లో, జనసేన పార్టీ కేవలం 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ పరిణామాలను గమనిస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు.

    ప్రజారాజ్యం బాహుబలి, కంగ్రాట్స్ చిరంజీవిగారు

    ‘‘జనసేన పార్టీతో పోలిస్తే ప్రజారాజ్యం పార్టీ బాహుబలి, కంగ్రాట్స్ చిరంజీవిగారు'' అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 18 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. అయితే జనసేన పార్టీకి ఇందులో పావువంతు సీట్లు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. జనసేన పార్టీ అన్ని జిల్లాల్లో సున్నాలే నమోదు చేస్తోంది అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ఈ సందర్భంగా వర్మ షేర్ చేశారు.

    లోకేష్ నిజాయితీగా ఒప్పుకున్నారంటూ...

    మరోవైపు ఘోర పరాజయం దిశగా అడుగులు వేస్తున్న తెలుగు దేశం పార్టీని సైతం వర్మ తనదైన శైలిలో దెప్పిపొడుస్తున్నారు. ఫన్నీ మీమ్స్, వీడియోలు షేర్ చేస్తూ తన ప్రతాపం చూపిస్తున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో లోకేష్ టంగ్ స్లిప్ అవుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయవద్దని చెప్పిన వీడియోను మరోసారి షేర్ చేశారు. వాళ్ల నాన్నతో పోలిస్తే లోకేష్ చాలా హానెస్ట్ అంటూ ట్వీట్ చేశారు.

    పసుపు కుంకుమ తీసుకుని ఉప్పుకారం పూసిన ఏపీ మహిళలు

    ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు పలు ప్రజాకర్షక పథకాలు ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి ‘పసుపు కుంకుమ'. ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహాయం అందించారు. దీనిపై వర్మ స్పందిస్తూ.... ఏపీ మహిళలు పసుపు కుంకుమ తీసుకుని ఉప్పుకారం పూశారంటూ సెటైర్లు వేశారు.

    కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్

    ఆ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు చంద్రబాబు మహాకూటమిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే బాబు ఎత్తులు కేసీఆర్ రాజకీయం ముందు పనిచేయలేదు. ఆ సమయంలో కేసీఆర్ స్పందిస్తూ... బాబుకు రిటర్న్ గిప్ట్ ఇస్తానని ప్రకటించారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ వర్మ ట్వీట్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏపీలో జగన్‌ అధికారంలోకి వచ్చేలా చేయడమే అన్నారు.

    English summary
    "PRAJARAJYAM is BAHUBALI compared to JANASENA ..CONGRATS CHIRNJEEVI GARU." Ram Gopal Varma tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X