twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి డైరక్షన్ లో సూర్యప్రకాశ్

    By Staff
    |

    తన గురువు కె.రాఘవేంద్రరావు కుమారుడు కె.సూర్యప్రకాశరావు హీరోగా తానో సినిమా డైరక్ట్ చేయటానికి ప్లాన్ చేసానని అయితే అది మెటీరియలైజ్ కాలేదని ఎస్.ఎస్.రాజమౌళి చెప్పుకొచ్చారు. సూర్యప్రకాశ్ డైరక్షన్ లో సిద్దార్ధ హీరోగా చేస్తున్న సినిమా పూజ సందర్భంగా అటెండయిన రాజమౌళి తన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం రిలీజ్ తర్వాత సూర్యప్రకాశ్ తో చిత్రం చేద్దామనుకున్నామని,అది జానపద చిత్రమని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే అనుకోని పరిస్ధితులులో ఆ ప్రాజెక్టు ఆగిందన్నారు. ఇక సూర్యప్రకాశ్ అద్బుతమైన స్క్రిప్టు రైటర్ అని ఆయన మెచ్చుకున్నారు.

    సూర్యప్రకాశ్ స్క్రిప్టులతో నాకు డైరక్ట్ చేయాలనిపిస్తుందని రాజమౌళి చెప్పుకొచ్చారు. అలాగే విజువల్ సెన్స్ ఉన్నవారిని నవతరం దర్శకులు అంటున్నారుని అయితే ఎమోషన్స్ తెరపై అద్బుతంగా పండించగలిగే వారినే నేను ఈ తరం దర్శకులు అంటాను అన్నారు. సూర్యప్రకాశ్ ఆ విషయంలో చాలా గొప్పవాడని భావిస్తున్నాను. కె.రాఘవేంద్రరావు గారు తన తండ్రి కె.ఎస్.ప్రకాశరావు కన్నా గొప్ప దర్శకుడు అనిపించుకున్నారు. అలాగే సూర్యప్రకాశ్ కూడా అతని తండ్రి రాఘవేంద్రరావు గారి కన్నా గొప్ప దర్శకుడు అవుతాడని చెప్పారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X