twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగ్‌లకు కేంద్రం అనుమతి.. వారు మాస్క్‌లు ధరించకపోయినా పర్లేదు!!

    |

    దేశంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. అయితే ఓ వైపు కరోనా తాండవం చేస్తోంటో మరో వైపు అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. వివిద దశలో వివద రంగాలకు మినహాయింపులు ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సినిమా, టెలివిజన్ రంగాలకు షూటింగ్‌లను చేసుకునే అనుమతిని ఇచ్చారు. అయితే ఇప్పటికే కొన్ని ప్రభుత్వాలు ఇప్పటికే వీటికి అనుమతిని మంజూరు చేయగా కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో ప్రకటన చేసింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది.

    అసలే టీవీ, సినీ ఇండస్ట్రీల్లో కరోనా తాండవం చేస్తోంది. ఇప్పటికే పలు ఇండస్ట్రీల్లోని సినీ పెద్దలందరూ కరోనా బారినపడ్డారు. అందుకే భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించేందకు నిర్మాతలు అలోచిస్తున్నారు. సెట్‌లో అడుగుపెట్టడానికి హీరో, హీరోయిన్లు కూడా భయపడుతున్నారు. కానీ కేంద్రం తాజాగా ఇచ్చిన ఆదేశాలు సినీ రంగంలో ఆశలు నింపేలా ఉంది. నిన్న సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది.

    Prakash Javadekar About To Resume Movie Shooting

    షూటింగ్ సమయంలో నటీనటులు మాస్క్‌లు ధరించకపోయినా పర్లేదు అని తెలిపింది. అయితే అదే సమయంలో ఇతర సాంకేతిక నిపుణులు, సెట్ వర్కర్స్ మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పీపీఈ కిట్స్ ధరించాలని, ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. సెట్‌లో కచ్చితంగా హెల్త్ ప్రోటోకాల్ పాటించాలని హెచ్చరించింది. ఇక ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆదేశాలతోనైనా హీరో హీరోయిన్లు ముందుకు వస్తారో లేదో చూడాలి.

    English summary
    Prakash Javadekar About To Resume Movie Shooting. film and television programme production can be resumed with all the necessary health protocols in place.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X