twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆరక్షణ్‌ బ్యాన్‌పై సుప్రీంకోర్టుకెక్కిన ప్రకాష్ ఝా

    By Bojja Kumar
    |

    విద్యా రంగంలో కుల పరమైన రిజర్వేషన్లను వ్యతిరేకించే విధంగా...'ఆరక్షణ్" సినిమా ఉందని ఆరోపిస్తూ ఆ సినిమా విడుదలను పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపివేయడంపై చిత్ర దర్శకుడు ప్రకాష్ ఝా, నిర్మాతలు శుక్రవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సినిమాలో ఏముందో చూడకుండా తన సినిమాను రిజర్వేషన్లను వ్యతిరేకించే విధంగా ఉందని ఆరోపించడం సబబు కాదని, ఇలా చేయడం భావ ప్రకటన స్వేచ్చకు విఘాతం కలిగించడమే అని పిటీషన్ లో పేర్కొన్నారు. వెంటనే తన సినిమా విడుదలయ్యే విధంగా చూడాలని, అభ్యంతర కరంగా ఉన్న సన్ని వేశాలను తొలగింపు సిద్ధమే అని కోర్టుకు విన్నవించారు.

    బిగ్ బి, సైఫ్ అలీఖాన్, దీపికా పడుకొనె ముఖ్య తారాగణంగా, విద్యా, ఉద్యోగ వ్యవస్థలో కులపరమైన రిజర్వేషన్లు ప్రధాన అంశంగా దర్శకుడు ప్రకాష్ ఝా 'ఆరక్షణ్" సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. సినిమాలో స్వల్ప మార్పులు చేయడానికి తాను సిద్ధమేనని ప్రకాష్ ఝా చెప్పారు. ఈ సినిమా కేవలం రిజర్వేషన్లపైనే కాకుండా విద్యా వ్యాపారంపై కూడా తీసిందని ఆయన అన్నారు.

    English summary
    Filmmaker Prakash Jha and producers of 'Aarakshan' on Friday moved the Supreme Court to lift the ban on the film in states of Uttar Pradesh, Punjab and Andhra Pradesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X