పవన్ సత్యాగ్రహికి అమితాబ్ ట్విస్టు

By Srikanya

పవన్ కళ్యాణ్ కలల ప్రాజెక్టు సత్యాగ్రహి. తను ఎంతో ఇష్టపడి ప్రారంభించినటువంటి ఈ చిత్రం టైటిల్ తో హిందిలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో ఓ చిత్రం రూపొందనుంది.ప్రముఖ దర్శకుడు ప్రకాష్ ఝా ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయటానికి సిద్దం అవుతున్నారు.అన్నాహజారే పోరాటం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది.అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే జరుపుతున్న పోరాటం,అందుకు ప్రభుత్వం నుండి ఎదురవుతున్న వ్యతిరేకత ఇందులో ప్రధానపాత్ర వహించనున్నాయి.ఇక ఈ చిత్రం గురించి ప్రకాష్ ఝా మాట్లాడుతూ..ఇప్పటికి ఈ చిత్రం కోసం అమితాబ్ మాత్రం ఎంపిక చేసాం.స్క్రిప్టు వర్క్ జరుగుతోంది.ప్రశాంతంగా జరిగే పోరాటం ఇందులో ప్రధానాంశం.అలాగే ఈ చిత్రం జనవరిలో షూటింగ్ మొదలవుతుంది అన్నారు.

ఇక పవన్ సత్యాగ్రహి చిత్రం విషయానికి వస్తే... అప్పట్లో ఈ చిత్రాన్ని బంగారం నిర్మించిన నిర్మాతలు చేత ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు.ఆ తర్వాత సీన్ లోకి సూర్య పేపర్ అధినేత నూకారపు సూర్య ప్రకాశరావు వచ్చారు.కానీ తర్వాత ఆ ప్రపోజల్ ఆగిపోయింది.తన కిష్టమైన చేగువేరా సిద్ధాంతాలను బలపరచటం,కామన్ ఫ్రొటక్షన్ ఫోర్స్ కి సంభందించిన వివరాలను విశదీకరించి అదో ఉద్యమంలా ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనలు ఈ చిత్రంలో చోటు చేసుకోనున్నాయని అప్పట్లో అన్నారు.అలాగే తన దర్శకత్వంలో రానున్న చిత్రం కావటం తో కమర్షియల్ ఎలిమెంట్స్ కన్నా వాస్తవికతకు పెద్ద పీట వేయాలని అనుకున్నారు.అయితే ఇప్పుడు అదే టైటిల్ తో ఓ చిత్రం రూపొందనుందటం పవన్ కి ఊహించని ట్విస్టే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X