భర్తకు విడాకులు ఇచ్చి.. టాలీవుడ్ దర్శకుడి మాజీ కోడలు సినీ రచయితతో డేటింగ్!

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా థిల్లాన్ మరోసారి ప్రేమలో పడిందనే వార్తలు బాలీవుడ్ మీడియాలో ఊపందుకొన్నాయి. ప్రస్తుతం ఆమె జాతీయ అవార్డు గ్రహీత హిమాంషు శర్మతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయాన్ని సన్నిహితులు కూడా దృవీకరిస్తున్నాయి. అయితే వీరిద్దరూ ఇంకా ధృవీకరించకపోవడంతో వారి మధ్య ఉంది అఫైరా? లేక సన్నిహిత సంబంధాలా అనే ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలాయి. ఇక కనికా థిల్లాన్ అఫైర్, వ్యక్తిగత జీవితం గురించి వివరాల్లోకి వెళితే..

 ప్రకాశ్ కోవెలమూడితో పెళ్లి

ప్రకాశ్ కోవెలమూడితో పెళ్లి

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడితో కనికా థిల్లాన్ వివాహం జరిగింది. అయితే వారిద్దరూ బాలీవుడ్‌లోను, టాలీవుడ్‌లోనూ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించారు. అయితే అనూహ్యంగా వారిద్దరూ తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ విడిపోవడం అటు బాలీవుడ్‌లోనూ, ఇటూ టాలీవుడ్‌లోనూ చర్చనీయాంశమైంది.

 ప్రకాశ్, కనికా థిల్లాన్ బ్రేకప్

ప్రకాశ్, కనికా థిల్లాన్ బ్రేకప్

గతేడాది ఆరంభంలో ప్రకాశ్ జాగర్లమూడి, కనికా థిల్లాన్ తమ వైవాహిక బంధానిని ముగింపు పలికారు. అయితే వారి మధ్య వ్యక్తిగత విభేదాలే అందుకు కారణమని చెప్పినప్పటికీ.. స్పష్టమైన కారణాలు బయటకు వెల్లడి కాలేదు. అయితే వారిద్దరూ సానుకూల పరిస్థితుల్లోనే విడిపోయారనే విషయం సినీ వర్గాలు వెల్లడించాయి. అయితే అటు ప్రకాశ్ గానీ, ఇటు కనికా గానీ తమ బ్రేకప్ గురించి పెద్దగా మాట్లాడకపోవడంతో వివాదంగా మారలేదు.

కేదారినాథ్ రచయితతో డేటింగ్

కేదారినాథ్ రచయితతో డేటింగ్

ప్రకాశ్ జాగర్లమూడితో దాంపత్య బంధాన్ని తెంచుకొన్న తర్వాత కొద్ది నెలలుగా బాలీవుడ్ సినీ రచయిత హిమాంషు శర్మతో సన్నిహితంగా ఉంటున్నారు. కేదారినాథ్, గిల్టీ సినిమాలకు ఆయన రచయితగా పనిచేశారు. కేదారినాథ్ చిత్రానికి ఆయనకు జాతీయ అవార్డు లభించింది. తాజాగా వారిద్దరి మధ్య అఫైర్ కొనసాగుతుందని, త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి అవకాశముందనే విషయాన్ని పింక్ విల్లా వెబ్‌సైట్ తమ కథనాల్లో పేర్కొన్నది.

రక్షాబంధన్ పోస్టర్‌ను ట్వీట్ చేసి..

రక్షాబంధన్ పోస్టర్‌ను ట్వీట్ చేసి..

ఇటీవల అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదలైంది. ఈ చిత్రానికి హిమాంషు రచయితగా పనిచేశారు. అక్షయ్ రిలీజ్ చేసిన పోస్టర్‌ను కనికా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఏయ్ హిమాంషు.. నీ తదుపరి సినిమా కోసం నా హృదయం ఎదురుచూస్తున్నది అని ట్వీట్‌లో కనికా పేర్కొన్నది. దాంతో వారిద్దరి మధ్య ఏదో జరుగుతున్నదనే పొగ బయటకు పొక్కింది. తాజాగా ఒకరిపై ఒకరు అత్యంత సన్నిహితంగా ఉండే ఫోటోతో వారిద్దరి మధ్య అఫైర్‌కు క్లారిటీ వచ్చింది.

Recommended Video

Vijay Sethupathi Out From Allu Arjun's Pushpa Movie
కనికా థిల్లాన్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ కెరీర్ గురించి

కనికా థిల్లాన్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ కెరీర్ గురించి

కనికా కెరీర్ విషయానికి వస్తే.. పంజాబీ యువతి అయిన కనికా థిల్లాన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డిగ్రీ చేసింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్‌ కంపెనీలో పనిచేసింది. ఆ తర్వాత షారుక్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. ప్రకాశ్ జాగర్లమూడితో పెళ్లి తర్వాత అనుష్క శెట్టి నటించిన సైజ్ జీరో, మన్మర్జియాన్, కేదారినాథ్, జడ్జిమెంటల్ హై క్యా చిత్రాలకు పనిచేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X