twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘వకీల్ సాబ్’పై చిరు ప్రశంసలు.. దండం పెట్టేసిన ప్రకాష్ రాజ్

    |

    టాలీవుడ్‌లో ప్రస్తుతం వకీల్ సాబ్ హవా నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వకీల్ సాబ్ దూసుకుపోతోన్నాడు. ఇక మెగా ఫ్యామిలీ మాత్రం గాల్లో తేలిపోతోంది. మెగా ఫ్యామిలీ ఇస్తోన్న రివ్యూలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్ ఇలా అందరూ కూడా వకీల్ సాబ్ గురించి పవన్ కళ్యాణ్ నటన గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.

    చిరంజీవి ప్రత్యేకంగా వేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. మూడు సంవత్సరాల తరువాత మళ్లీ పవన్ కళ్యాణ్ అదే వేడి అదే వాడి.. అదే పవర్.. ప్రకాష్ రాజ్‌తో కోర్డు రూమ్ డ్రామా అద్భుతం.. నివేదా థామస్, అంజలి, అనన్య వాళ్ల పాత్రల్లో జీవించారు. తమన్, పీఎస్ వినోద్ ప్రాణం పోవారు. దిల్ రాజు, బోనీ కపూర్, వేణు శ్రీరామ్ మిగతా అందరికీ శుభాకాంక్షలు అని తెలిపాడు.

    Prakash raj about chiranjeevi reaction on vakeel saab

    ఇక చిరంజీవి ఇలా తన పేరును ప్రత్యేకంగా గుర్తించడంతో ప్రకాష్ రాజ్ ఎమోషనల్ అయ్యాడు. కోర్ట్ రూం సీన్స్ అదిరిపోయాయనే టాక్ వచ్చింది. చిరంజీవి కూడా అదే ప్రస్థావించాడు. అలా తన పాత్ర గురించి మాట్లాడటంతో ప్రకాష్ రాజ్ స్పందించాడు. దండం పెడుతున్న ఎమోజీలతో థ్యాంక్యూ అన్నయ్య అంటూ చిరు ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. మొత్తానికి చాలా రోజులు తరువాత ప్రకాష్ రాజ్ తన నటనతో అందరినీ మెప్పించేశాడు.

    English summary
    Prakash raj about chiranjeevi reaction on vakeel saab
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X