Don't Miss!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
‘వకీల్ సాబ్’పై చిరు ప్రశంసలు.. దండం పెట్టేసిన ప్రకాష్ రాజ్
టాలీవుడ్లో ప్రస్తుతం వకీల్ సాబ్ హవా నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వకీల్ సాబ్ దూసుకుపోతోన్నాడు. ఇక మెగా ఫ్యామిలీ మాత్రం గాల్లో తేలిపోతోంది. మెగా ఫ్యామిలీ ఇస్తోన్న రివ్యూలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్ ఇలా అందరూ కూడా వకీల్ సాబ్ గురించి పవన్ కళ్యాణ్ నటన గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.
చిరంజీవి ప్రత్యేకంగా వేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. మూడు సంవత్సరాల తరువాత మళ్లీ పవన్ కళ్యాణ్ అదే వేడి అదే వాడి.. అదే పవర్.. ప్రకాష్ రాజ్‌తో కోర్డు రూమ్ డ్రామా అద్భుతం.. నివేదా థామస్, అంజలి, అనన్య వాళ్ల పాత్రల్లో జీవించారు. తమన్, పీఎస్ వినోద్ ప్రాణం పోవారు. దిల్ రాజు, బోనీ కపూర్, వేణు శ్రీరామ్ మిగతా అందరికీ శుభాకాంక్షలు అని తెలిపాడు.
ఇక చిరంజీవి ఇలా తన పేరును ప్రత్యేకంగా గుర్తించడంతో ప్రకాష్ రాజ్ ఎమోషనల్ అయ్యాడు. కోర్ట్ రూం సీన్స్ అదిరిపోయాయనే టాక్ వచ్చింది. చిరంజీవి కూడా అదే ప్రస్థావించాడు. అలా తన పాత్ర గురించి మాట్లాడటంతో ప్రకాష్ రాజ్ స్పందించాడు. దండం పెడుతున్న ఎమోజీలతో థ్యాంక్యూ అన్నయ్య అంటూ చిరు ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. మొత్తానికి చాలా రోజులు తరువాత ప్రకాష్ రాజ్ తన నటనతో అందరినీ మెప్పించేశాడు.