హర్ట్ చేస్తే ఊరుకోను: ప్రకాష్ రాజ్
నాకు కాస్త ధీషణాహంకారం ఎక్కువ. నన్ను ఎవరైనా హర్ట్ చేస్తే... ఇక నేను వాళ్లకు అందను. నాకు నేను ఓ ఆస్తిగా భావిస్తా. అలాగే తాజ్‌మహల్ దగ్గరకు మనమే వెళ్లాలండీ. మనదగ్గరకు అది రాదు అంటూ తనగురించి కాస్త తీక్షణంగానే సమాధానమిచ్చారు ప్రకాష్ రాజ్. ఆయన్ని ప్రకాష్‌రాజ్ పదిరోజులు డేట్స్ ఇచ్చాడంటే... ఇక దర్శక, నిర్మాతలకు ఇబ్బంది అంటుంటారు దానికి మీ సమాధానం అన్నదానికి ఇలా స్పందించారు. ఆయన తాజా చిత్రం 'ధోని' ఈ నెల 10న విడుదల అవుతున్న సందర్భంగా ప్రకాష్‌రాజ్ మీడియాతో ముచ్చటిస్తూ ఇలా అన్నారు.
పూరీ జగన్నాధ్ కుమారుడు మాస్టర్ ఆకాష్ ముఖ్య పాత్రధారిగా స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించారు ఆయన. ఇక చిత్రం గురించి చెపుతూ..''చాలాకాలంగా ఓ విషయంపై నేను అంతర్మథనం పడుతుండేవాడ్ని. మహేష్‌మంజ్రేకర్ మరాఠీలో రూపొందించిన 'శిక్షణ ఐచా గో' సినిమా చూశాక నాలో ఆ సంఘర్షణ ఇంకా ఎక్కువైంది. ఆ కథను ఆదర్శంగా తీసుకొని మధ్యతరగతి మనిషి మనోభావాన్ని తెరపై ఆవిష్కరించాలనుకున్నాను. ఆ ప్రయత్నమే 'ధోని'. సమాజంలోని పరిస్థితులపై నాకొచ్చిన కోపం, ఆక్రోశం ఈ సినిమా'' అని ఆయన అన్నారు. అలాగే ప్రభుదేవా ఇందులో గెస్ట్‌గా చేశారు. ఇళయరాజా సంగీతం ప్రాణం పోసింది.


Click it and Unblock the Notifications











