twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవిని ఎందుకు లాగుతున్నారో, తేడా వస్తే తీసి పడేస్తారు, కేసీఆర్, జగన్‌ జోక్యం‌పై: ప్రకాశ్‌రాజ్‌ భావోద్వేగం

    |

    టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల్లో కోలాహలం మూడు నెలల ముందే మొదలైంది. వర్గాల వారీగా విడిపోయి ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడంతో ఎన్నికల వేడి రాజుకొన్నది. ఈ క్రమంలో మీడియాలో అనేక ఊహాగానాలు వస్తుండటంతో నటుడు ప్రకాశ్ రాజ్ తన మద్దతుదారులు, ప్యానెల్ మెంబర్స్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ..

    Recommended Video

    MAA Election : Jeevita Rajasekhar Vs Prakash Raj Vs Manchu Vishnu| Triangular Fight|Filmibeat Telugu
    కేసీఆర్, కేటీఆర్ జోక్యం అంటూ

    కేసీఆర్, కేటీఆర్ జోక్యం అంటూ

    మీడియాకు నమస్కారం. మీడియాను చూసి ఫస్ట్ టైం భయమేసింది. మా సభ్యులకంటే మీడియానే ఎక్కువగానే ఉన్నారు. కొద్ది రోజులుగా టీవీ చూసినప్పుడు పొలిటికల్ పార్టీలు మా ఎన్నికల్లోకి వచ్చాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకొంటున్నారు. ఏపీ సీఎం కూడా మా ఎన్నికలపై ప్రభావం చూపబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. అయితే దీనిని ఇలా కొనసాగిస్తే.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, అమెరికా అధ్యక్షుడు బిడెన్ కూడా మా ఎన్నికల్లో జోక్యం చేసుకొంటారనే వార్తలు వినవస్తాయేమో అనే భయం కలిగింది అంటూ ప్రకాశ్ రాజ్ చమత్కరించారు.

    ఆరు నెలల నుంచి ప్రణాళికతో

    ఆరు నెలల నుంచి ప్రణాళికతో

    సినిమా బిడ్డలు అనే టైటిల్‌ను నిన్న, మొన్న డ్రాప్ట్ చేసిన ప్లాన్ కాదు. కనీసం ఆరు నెలల నుంచి బయటకు రాకుండా మనం కసరత్తు చేస్తున్నాం. గత కొద్ది నెలలుగా మా సంస్థకు సంబంధించిన సున్నిత విషయాలు ఆందోళన కలిగించాయి. సాటి నటీనటులతో మాట్లాడుతూ.. ప్రతిష్ట, గౌరవాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. కళాకారులకు సంబంధించిన సున్నితమైన విషయం మీడియాలో వినోదంగా ఎందుకు మారిందనే విషయంపై అందరితో చర్చిస్తున్నాం అని ప్రకాశ్ రాజ్ క్లారిటీ ఇచ్చారు.

    ఏ ఒక్కరి వర్గం కాదు...

    ఏ ఒక్కరి వర్గం కాదు...

    వచ్చే మూడు నెలల్లో జరిగే ఎన్నికల్లో పాల్గొనేందుకు అన్ని వర్గాల వారితో మాట్లాడుతూ ఉన్నాం. ఇది రాజకీయ పోటీ కాదు. ఇందులో వర్గాలు లేవు. మేము ఎవరి వర్గం కాదు. కేవలం చిత్తశుద్దితో పనిచేసే టీమ్‌ను, ప్రశ్నించే సత్తా ఉన్న వారితో మేము కలిసి సంప్రదింపులు జరిపాం. మా టీమ్‌లో శ్రీకాంత్. జయసుధ, బెనర్జీ, సాయి కుమార్, బండ్ల గణేష్ లాంటి వాళ్లు, ఎంతో అనుభవం ఉన్న వాళ్లు ఉన్నారు. నేను తప్పు, తేడా చేస్తే పశ్నించి నన్ను తొలగించే సాహసానికి వెనుకాడరు. కాబట్టి మీడియా మా విషయంలో తొందరపాటు కథనాలు వెల్లడించవద్దు అని ప్రకాశ్ రాజ్ కోరారు.

    చిన్న ఆర్టిస్టులు మానసికంగా...

    చిన్న ఆర్టిస్టులు మానసికంగా...

    ఎన్నికలనే గోప్యంగా జరుగాల్సిన అంశం. తమ మనసాక్షితో వేయాల్సిన ఓటు. ఇలాంటి సమయంలో చిన్న ఆర్టిస్టులు ఎటు వైపు ఉండాలో తేల్చుకోలేకపోతున్నారు. ఆ వైపు వెళ్లాలా? ఈ వైపు వెళ్లాలా అని తేల్చుకోలేకపోతున్నారు. చిన్న ఆర్టిస్టులు మానసికంగా ఉద్వేగానికి గురి అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము మీడియా ముందుకు వచ్చి మాట్లాడకూడదని అనుకొన్నాం. అనసూయ, ప్రగతి, ఉత్తేజ్ లాంటి వాళ్లు గట్టిగా మాట్లాడే సత్తా ఉంది అని అన్నారు.

    చిరంజీవిని లాగొద్దు అంటూ...

    చిరంజీవిని లాగొద్దు అంటూ...

    మా ఎన్నికల వ్యవహారంలో చిరంజీవిని ఎందుకు లాగుతున్నారనే విషయం అర్ధం కావడం లేదు. నాగార్జున, వెంకటేష్ లాంటి వాళ్లు బయటకు రావాల్సిన అవసరం లేదు. ఎవరినీ బయటకు లాగకుండా చర్యలు తీసుకొంటున్నాం. అందుకే మీడియా ముందుకు రావడం లేదు. ఏ మీడియాతో మాట్లాడితే ఎలాంటి సంకేతాలు, వివాదాలకు దారి తీస్తాయనే విషయంతో చాలా జాగ్రత్తగా ఉన్నాం అని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు.

    English summary
    Prakash Raj about MAA Elections strategy and clarity on rumours in media. Jaya Sudha to contest for MAA President post: Movie Artist Association (MAA) Elections to held soon. Report suggest that Jaya Sudha in the race of President post. Actress Jeevitha Rajasekhar to contest President against Prakash Raj and Manchu Vishnu. Already Prakash raj seek support from Chiranjeevi, Nagababu and others.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X